బాత్రూమ్‌లో మొసలి : గుండెలు అదిరిపోయాయి..!

వడోదరా : బల్లి లేదా బొద్దింకనో చూస్తేనే అంతెత్తున ఎగరిపడుతుంటారు కొంతమంది. అలాంటిది ఏకంగా ఓ మొసలే నట్టింట్లో ప్రత్యక్షమైతే..! గుండె బేజారైపోదూ! వడోదరాలో ఓ ఇంటి యజమానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

వివరాల్లోకి వెళ్తే.. వడోదరలోని జయనారాయణ్ నగర్ పరిధిలోని దబోయి రోడ్డు ప్రాంతంలో నివసించే నరేంద్ర అనే వ్యక్తి తన పక్కింట్లో ఉన్న బాత్రూమ్ లోకి మొసలి చొరబడడం గమనించాడు. దీంతో వెంటనే ఆ యజమాని సుమిత్రా పటేల్ తో పాటు ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశాడు. నరేంద్ర చెప్పగానే బాత్రూమ్ లోకి వెళ్లి పరిశీలించిన సుమిత్రా పటేల్.. అక్కడ మొసలిని చూసి షాక్ కు గురయ్యాడు.

Two feet Crocodile entered in bathroom at vadodara

అనంతరం అటవీశాఖ అధికారులకు విషయాన్ని చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మొసలిని పట్టుకుని అక్కడినుంచి మొసళ్ల పెంపక కేంద్రానికి తరలించారు. ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, కాలనీకి ఆనుకుని ఓ వరద నీటి కాలువ ప్రవహిస్తుండడం ద్వారా.. అందులోంచి మొసళ్లు ఇళ్లలోకి చొరబడుతున్నాయని జంతుపరిరక్షకుడు రాకేష్ వద్వానా తెలిపారు. స్థానిక విశ్వామిత్ర నదిలో తిరిగే మొసళ్లు ఇలా వరదనీటిలోంచి జన సముదాయాల్లోకి కొట్టుకువస్తున్నాయని వివరించారు రాకేష్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+