ఇద్దరమ్మాయిలు ప్రేమించుకున్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?
స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించడంపై భారతదేశంలో చాలా కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించేందుకు నిరాకరించింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ స్వలింగ సంపర్కుల వివాహం ప్రాథమిక హక్కు కాదని పేర్కొంది. ఈ తరుణంలో బీహార్‌లోని ఓ ఘటన అందరిని విస్మయానికి గురిచేసింది. బీహర్‌లోని జుముయ్ జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి వీరిద్దరి మధ్య ఈ ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ఏడాదిన్నర నుంచి నడుస్తోన్న ప్రేమ వ్యవహరం..
నిజానికి, ఈ వ్యవహారం జముయ్ జిల్లాలోని లక్ష్మీపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందినది. జహాన్ నివాసి నిషా కుమారి, లఖిసరాయ్ జిల్లాలోని హల్సీకి చెందిన కోమల్ కుమారితో ప్రేమలో పడ్డారు. దాదాపు ఏడాదిన్నర నుంచి వీరిద్దరి మధ్య ఈ ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇద్దరూ కలిసి జీవించాలని చేతిలో చేయ్యి వేసుకుని మరీ ప్రమాణాలు కూడా చేసుకున్నారు. అంతే కాదు వీరిద్దరూ కలిసి ఇంట్లో నుంచి పారిపోయి మరీ గుళ్లో పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పెళ్లి చేసుకుని పారిపోయారు...
కోమల్ కుమారి హల్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గెరువా పుర్సంద గ్రామానికి చెందినది. నిషా కుమారి లక్ష్మీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిగ్గి గ్రామానికి చెందినది. వీరిద్దరూ ఓ వివాహ వేడుకలో సుమారు ఏడాదిన్నర క్రితం కలిసారు. ఆ తర్వాత వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే, ఇంట్లో వారికి వీరి ప్రేమ గురించి చెప్పినా ఒప్పుకోరని గ్రహించిన ఈ జంట ఏకంగా ఈ నెల 24న ఓ గుళ్లో వారి పెళ్లితంతును ముగించారు.
ఆ తర్వాత అక్కడినుంచి వారిద్దరూ పాట్నా పారిపోయారు. అయితే, నిషా కుమారి కుటుంబీకులు కుమార్తె కనబడుట లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న ఈ జంట తిరిగి ఆ గ్రామానికి వెళ్లే సందర్భంలో జీఆర్‌పి వీరిని పట్టుకుంది. అప్పడు వీరిద్దరూ వారి ప్రేమ వ్యవహారం, పెళ్లి గురించి బయటపెట్టారు. అయితే, ఈ వింత పెళ్లి వ్యవహారం కాస్తా ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications