Breaking : మధ్యప్రదేశ్ లో కూలిన రెండు ఎయిర్ ఫోర్స్ జెట్స్-ట్రైనింగ్ లో అపశృతి..
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రెండు ఎయిర్ ఫోర్స్ జెట్లు కుప్పకూలాయి. భారత వాయుసేన నిర్వహిస్తున్న ట్రైనింగ్ లో పాల్గొంటున్న ఈ రెండు జెట్లు కుప్పకూలడంతో ఘటనా స్ధలంలో భీతావహ పరిస్ధితి నెలకొంది.
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఇవాళ ఓ విషాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు సుఖోయ్ సు-30, మిరాజ్ 2000 శిక్షణ సమయంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ రెండు యుద్ధ విమానాలు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి శిక్షణ కోసం బయలుదేరాయి. శిక్షణలో పాల్గొంటున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు విమానాలు పరస్పరం ఢీకొని కుప్పకూలాయా లేక విడివిడిగానే కుప్పకూలాయా అన్న దానిపై ఎయిర్ ఫోర్స్ వివరాలు సేకరిస్తోంది.
మధ్యప్రదేశ్ లోని గ్యాలియర్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఈ రెండు విమానాలు ప్రమాదవశాత్తూ కుప్పకూలాయి. అయితే ఒకేసారి రెండు విమానాలు ఎలా కుప్పకూలాయన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుఖోయ్-30లో ఇద్దరు పైలట్లు, మిరాజ్ 2000 విమానంలో ఒకరు ఉన్నారు. పైలట్‌లలో ఇద్దరు సురక్షితంగా ఉన్నారని, మూడవ పైలట్‌ను రక్షించడానికి ఓ ఛాపర్ పంపినట్లు తెలుస్తోంది. ఈ రెండు విమానాలు గాల్లోనే ఢీకొన్నాయా లేదా అనే అంశాన్ని తేల్చడానికి ఐఏఎఫ్ కోర్టు విచారణ ప్రారంభించింది
#WATCH | Wreckage seen. A Sukhoi-30 and Mirage 2000 aircraft crashed near Morena, Madhya Pradesh. Search and rescue operations launched. The two aircraft had taken off from the Gwalior air base where an exercise was going on. pic.twitter.com/xqCJ2autOe
— ANI (@ANI) January 28, 2023













Click it and Unblock the Notifications