Crime News: రెండు కిలోమీటర్ల మేర రైలు పట్టాలను ఎత్తుకెళ్లన దొంగలు..!
బిహార్ ఎంత పెద్ద దొంగలు ఉంటారో ఈ ఘటనను చూస్తే తెలిసిపోతోంది.
మన సాధారణంగా రైల్లో ప్రయాణిస్తునప్పుడు, లేదా రైలు పట్టాలను చూసినప్పుడు.. రైలు పట్టాలకు సంబంధించి చాలా సామాగ్రి పడి ఉంటుంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఇనుమును ఎత్తుకెళ్లారా అని చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. అయితే రైల్వేకు సంబంధించి ఏం దొంగలించిన శిక్షలు కఠినంగా ఉంటాయి. అందుకే రైల్వేకు సంబంధించి వాటిని దొంగతనం చేయాలంటే భయపడుతుంటారు.
కానీ ఓ చోట రెండు కిలోమీటర్ల మేర ఉన్న పనికిరాని రైలు పట్టాల వ్యర్థాలను అపహరించారు దొంగలు. ఈ ఘటన బిహార్ లోని సమస్తిపుర్ రైల్వే డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది. గతంలో మధుబని లోహత్ షుగర్ మిల్ నుంచి పండోల్ స్టేషన్ వరకు రైల్వే లైన్ వేశారు. అయితే ఏళ్ల తరబడి ఈ చక్కెర మిల్లు మూతపడి ఉండటం వల్ల ఈ మార్గం వినియోగంలో లేకపోవడంతో దొంగలు ఈ పట్టాలను ఎత్తుకెళ్లిపోయారు.

స్టేషన్లో పని చేసే అధికారులే ఈ దొంగతనానికి సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అంతర్గతంగా విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే డివిజన్ సెక్యూరిటీ కమిషనర్‌తో పాటు ఇద్దరు ఉద్యోగులను రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. ఇలాంటి సంఘటనలు బిహార్ లోనే ఎక్కువగా జరుగుతోన్నాయి. త సంవత్సరం ఏప్రిల్‌లో ఏకంగా బ్రిడ్జినే అపహరించారు.












Click it and Unblock the Notifications