టీటీవీ దినకరన్ తిక్కచేష్టలకు ఇంకో వికెట్ ! దెబ్బకు కొందరు మాయం, ఏం చేద్దాం ?

టీటీవీ దినకరన్ అనుచరుడైన మరో ఏజెంట్ షా ఫైసల్ ను విచారించాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నిర్ణయించారు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే అతనికి సమాచారం ఇచ్చారని తెలిసింది.

న్యూఢిల్లీ: టీటీవీ దినకరన్ దూకుడు చేష్టలకు మరో వికెట్ పడే అవకాశం ఉందని వెలుగు చూసింది. ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్ల లంచం ఎర వేశారని గుర్తించిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ ను అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఎఫ్ఐఆర్ లో అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్ పేరు చేర్చిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కోర్టు ముందు నిలబెట్టింది. దినకరన్ తో పాటు ఆయన చిరకాల మిత్రుడు మల్లికార్జున అరెస్టు అయ్యారు. అయితే ఇప్పుడు మరి కొందరి మీద ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు డేగకన్ను వేశారు.

సోషల్ మీడియా టెక్నాలజీ

సోషల్ మీడియా టెక్నాలజీ

టీటీవీ దినకరన్ సోషల్ మీడియా టెక్నాలజీ ఉపయోగించి పోలీసులకు మస్కా కొట్టాలని ప్రయత్నించారు. అసలే దేశ రాజధాని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు. సామాన్యంగా వదిలిపెడతారా ? మొత్తం కూపీలాగి దినకరన్ ను పట్టుకున్నారు.

సుఖేష్, దినకరన్ డీల్

సుఖేష్, దినకరన్ డీల్

ఎన్నికల కమిషన్ కు రూ. 50 లక్షలు ఇవ్వడానికి ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ డీల్ ఎలా కుదిరింది అంటూ ఆరా తీశారు. బెంగళూరు, చెన్నై, కోచ్చి, ఢిల్లీ కేంద్రాలుగా టీటీవీ దినకరన్ అండ్ కో పక్కా స్కెచ్ వేస్తూ వచ్చారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఎవరు ఈ షా ఫైసల్

ఎవరు ఈ షా ఫైసల్

సుఖేష్, దినకరన్ ల మద్య డీల్ కుదరడానికి షా ఫైసల్ అనే వ్యక్తి మొదట ముందుకు వచ్చారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే షా ఫైసల్ అనే ఏజెంట్ పాత్ర ఎంత చివరి వరకు ఉందా ? అని పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

పోలీసుల ముందు షా ఫైసల్ ?

పోలీసుల ముందు షా ఫైసల్ ?

బుధవారం దినకరన్ అనుచరుడైన మరో ఏజెంట్ షా ఫైసల్ ను విచారించాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నిర్ణయించారు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే అతనికి సమాచారం ఇచ్చారని తెలిసింది. దినకరన్ ను ఇప్పటికే విచారించిన పోలీసు అధికారులు షా ఫైసల్ ను రప్పించడానికి సిద్దం అయ్యారని తెలిసింది.

చెన్నైలో మరి కొన్ని వికెట్లు పడితే !

చెన్నైలో మరి కొన్ని వికెట్లు పడితే !

దినకరన్ ను చెన్నై తీసుకు వెళ్లి విచారించే సమయంలో మరి కొన్ని వికెట్లు పడే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. తమిళనాడుకు చెందిన ఓ మంత్రితో పాటు దినకరన్ కు అత్యంత సన్నిహితులు, ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి డబ్బు సమకూర్చిన వ్యక్తులను విచారించి అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+