Live Video: కార్తీక మాసంలో మహాపాపం.. సోమవారం అర్ధరాత్రి గర్భగుడిలో
అసలే అత్యంత పవిత్రమైన కార్తీక మాసం.. అందులోనూ పరమశివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం రాత్రి వేళ భక్తిశ్రద్ధలతో పూజలు చేయాల్సింది పోయి, ఏమాత్రం భయం లేకుండా దుర్మార్గానికి ఒడిగట్టారు కొందరు కేటుగాళ్లు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కాసుల కక్కుర్తితో గుడి గర్భగుడిలోకి ప్రవేశించిన దొంగలు.. దేవుడిపై భయం లేకుండా పవిత్రమైన పూజా సామాగ్రిని, విగ్రహాలను దోచుకెళ్లిన వైనం స్థానికంగా భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది.
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు దుండగులు ముఖాలకు మాస్కులు ధరించి, ఒంటికి దుప్పట్లు కప్పుకుని శివాలయం వద్దకు చేరుకున్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ప్లాన్ ప్రకారం గుడి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. నేరుగా గర్భగుడిలోకి వెళ్లి శివలింగంపై ఉన్న నాగుదేవుడి వెండి విగ్రహంతో పాటు కిరీటాన్ని, పవిత్రమైన రాగి కలశాన్ని, దీపారాధన కుందులు, ఇత్తడి ప్లేట్లను సర్దుకున్నారు. అంతటితో ఆగకుండా మైకులు, యాంప్లిఫైయర్, గుడికి వాడుతున్న ఇన్వర్టర్ దాని బ్యాటరీని కూడా వదలకుండా ఎత్తుకెళ్లారు. చివరికి దేవుని హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదును మొత్తం సర్దుకుని పరారయ్యారు.

తెల్లవారేసరికి వెలుగులోకి షాకింగ్ నిజం..
మంగళవారం ఉదయం నిత్య పూజల కోసం ఆలయ నిర్వాహకులు, భక్తులు గుడికి వచ్చేసరికి మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉండటాన్ని చూసి హ్రదయం గుబేల్మంది. వెంటనే కంగారుగా లోపలికి వెళ్లి పరిశీలించగా గుడిలోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఆలయ బాధ్యతలు చూసే సంతోష్ కుమార్ సక్సేనా ఉదయం తలుపులు తీయడానికి రాగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. గుడిలో లైట్లన్నీ ఆఫ్ చేసి ఉండటంతో ఆయన మొబైల్ టార్చ్ లైట్ వేసి చూడగా చోరీ జరిగిన తీరు అర్థమైంది. మొత్తంగా రూ. 30 వేల నుంచి రూ. 40 వేల విలువ చేసే సామాగ్రి, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దొంగల వీరంగం..
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులు దుప్పట్లు కప్పుకుని, మాస్కులతో గుడిలోకి దొంగచాటుగా ప్రవేశించిన దృశ్యాలు ఆ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఎంతో ప్రశాంతంగా ఒక్కో వస్తువును సంచుల్లో సర్దుకుని వారు పరారవుతున్న ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దేవుడి సొత్తును అపహరించి, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఆ కేటుగాళ్లను త్వరలోనే కఠినంగా శిక్షిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
उत्तर प्रदेश ——मेरठ में चोरों ने शिव मंदिर को बनाया निशाना!मेरठ में दो नकाबपोश बदमाश शिव मंदिर में घुसे और शिवलिंग पर लगी नागफन छत्री व कलश चोरी कर ले गए। पूरी करतूत CCTV कैमरे में कैद हो गई। https://t.co/lWLyRP5RSI
— @p2- चंद्रवंशी 🇮🇳 (@pra1366) November 17, 2026














Click it and Unblock the Notifications
