హీరోయిన్ కంటే అందంగా, వందల కోట్ల ఆస్తి, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం, చివరికి ఆమె !
భర్తతో విడాకులు తీసుకున్న శ్రీమంతుల కుటుంభానికి చెందిన పూనమ్ (26) అనే మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తున్న విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు సహనం కోల్పోయారు.
రాజ్ కోట్: భర్తతో విడాకులు తీసుకున్న శ్రీమంతుల కుటుంభానికి చెందిన పూనమ్ (26) అనే మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తున్న విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు సహనం కోల్పోయారు. పద్దతి మార్చుకోవాలని ఆమెకు చెప్పినా వినడం లేదని కక్షపెంచుకున్నారు.
వందల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా మనకు పరువు మర్యాద మంటకలిసిపోతోందని సహనం కోల్పోయిన సొంత సోదరులు ఆమెను అతి దారుణంగా హత్య చేశారు. కిరాయి హంతకులతో కలిసి హత్య చేసిన ఇద్దరు సోదరులు చివరికి సాక్షాలు చిక్కకుండా నాశనం చేసి ఇప్పుడు కటకాటాల పాలైనారు.

శ్రీమంతులు !
గుజరాత్ లోని రాజ్ కోట్ లో బిసువాలా అనే శ్రీమంతుడు నివాసం ఉంటున్నాడు. ఇతను రాజ్ కోట్ లో పేరుమోసిన వ్యాపారవేత్త. ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు బిరేన్ వాలా, రిజ్విర్ అనే ఇద్దరు కుమారులతో పాటు పూనమ్ వాల అనే కుమార్తె ఉంది.

పూనమ్ కు పెళ్లి అయ్యింది
రాజ్ కోట్ వ్యాపారి బిసువాల తన కుమార్తె కు ముంబైలో శ్రీమంతుల కుటుంబంలో ఓ పెళ్లి సంబంధం చూసి ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేశాడు. ఏడేళ్ల నుంచి పూనమ్ ముంబైలో భర్తతో కలిసి కాపురం ఉండేది. బిసువాల, ఆయన ఇద్దరు కుమారులు అప్పుడప్పుడు ముంబై వెళ్లి పూనమ్ ను చూసి వచ్చేవారు.

విడాకులు తీసుకున్న పూనమ్ !
కుటుంబ సమస్యలు ఉన్నాయంటూ ఇటీవల పూనమ్ చట్టపరంగా తన భర్తతో విడాకులు తీసుకుంది. తరువాత ముంబై నుంచి రాజ్ కోట్ చేరుకుని తల్లిదండ్రుల ఇంటిలోనే నివాసం ఉంటున్నది. శ్రీమంతులు కావడంతో పూనమ్ కు ప్రత్యేకంగా కారు తీసిచ్చారు.

పూనమ్ తిరుగుడు !
ప్రతి రోజు పూనమ్ ఇంటి నుంచి కారులో బయటకు వెలుతోంది. డ్రైవర్ ను వెంట తీసుకుని వెళ్లాలని చెప్పినా పూనమ్ మాత్రం ఆమె డ్రైవింగ్ చేసుకుంటూ బయటకు వెళ్లేది. పూనమ్ తన స్నేహితులను కలవడానికి వెలుతోందని కుటుంబ సభ్యులు భావించారు.

ప్రియుడితో జల్సా !
పూనమ్ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రాజ్ కోట్ లోనే తల్లిదండ్రులు, సోదరులకు తెలీకుండా ఆమె ప్రియుడితో కలిసి ప్రత్యేకంగా ఇంటిని తీసుకుని ప్రతి రోజు పగలు అక్కడే గడపడం మొదలుపెట్టింది. రాత్రి అయ్యే సరికి ఆమె ఇంటికి చేరుకునేదని సమాచారం.

సోదరులకు తెలిసింది !
పూనమ్ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తోందని ఆమె సోదరులు బిరెన్ వాలా, రాజ్విర్ లకు తెలిసింది. అక్రమ సంబంధం కోసమే భర్తకు విడాకులు ఇచ్చిందని కక్ష పెంచుకున్నారు. జస్ధాన్ రఘు జిదా, గౌతమ్ వాలా, మహేష్ అనే ముగ్గురితో కలిసి పూనమ్ ను హత్య చెయ్యాలని ప్లాన్ వేశారు.

సొంత ఇంటిలోనే కిడ్నాప్
బిరెన్ వాలా, రిజ్వర్ సోదరులు మే 25వ తేది జస్ధాన్ రఘు జిదా, గౌతమ్ వాలా, మహేష్ అనే ముగ్గురితో కలిసి రాజ్ కోట్ లోని రాష్ట్రీయ కళా కేంద్రం సోసైటిలోని సొంత ఇంటిలో పూనమ్ ను కిడ్నాప్ చేశారు. తరువాత జస్ధాన్ గ్రామంలోని తమ ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లారు.

పూనమ్ ను దారుణంగా !
ఇద్దరు సోదరులు మరో ముగ్గురితో కలిసి పూనమ్ తో బలవంతంగా విషం తాగించారు. ఐదు మంది కలిసి పూనమ్ కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకోవడంతో శరీరం మొత్తం విషయం వ్యాపించి ఆమె అక్కడికక్కడే మరణించింది. పూనమ్ అంత్యక్రియలు కూడా అదే ఫాం హౌస్ లో పూర్తి చేసి సాక్షాలు చిక్కకుండా జాగ్రత్తపడ్డారు.

అనుమానం !
పూనమ్ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు డీసీబీ (క్రైం బ్రాంచ్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు అనుమానం వచ్చి పూనమ్ సోదరులు బిరెన్ వాలా, రిజ్విర్ లను విచారించారు. వారు పొంతనలేని సమాదానం ఇవ్వడంతో డీసీబీ సీనియర్ అధికారి హెచ్ఎం. గాద్వీ రంగంలోకి దిగారు.

అక్రమ సంబంధంతోనే !
పూనమ్ చూడటానికి సినిమా హీరోయిన్ లాగా ఉంటుంది. పూనమ్ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే తాము పరువు హత్య చేశామని ఆమె సోదరులు బిరెన్ వాలా, రిజ్వర్ అంగీకరించారని డీసీబీ పోలీసు అధికారి హెచ్ఎం. గాధ్వీ మీడియాకు చెప్పారు. పూనమ్ హత్య కేసులో మిగిలిన ముగ్గురు జస్ధాన్ రఘు జిదా, గౌతమ్ వాలా, మహేష్ (కిరాయి హంతకులు) అజ్ఞాతంలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి హెచ్ఎం. గాద్వీ వివరించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications