తమ పార్ట్‌నర్స్ ఆ పనికి ఒప్పుకోలేదని 13 ఏళ్ల బాలుడిని అత్యాచారం
సభ్య సమాజం సైతం తలదించుకునే ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఒకరేమో తమ భార్య, మరొకరేమో తమ గర్ల్ ఫ్రెండ్ తమతో ఆ పనికి ఒప్పుకోలేదని ఇద్దరు కలిసి దారుణానికి ఒడిగట్టారు. 13 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేయడమే కాకుండా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేయడం దేశ వ్యాప్తంగా కలకలంగా మారింది. ఈ ఊహించని ఘటనలో ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిన వారు బాలుడి సమీపంలో నివసించేవారు కావడం గగుర్పాటుకు గురి చేస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్ కి చెందిన హుస్సేనితో రంజాన్ మాసం కావడంతో తన భార్య తనతో శృంగారం చేయడానికి నిరాకరించింది. అలానే తన స్నేహితుడు అజార్ కూడా తన గర్ల్ ఫ్రెండ్ తో కూడా ఇదే వ్యవహారంలో గొడవపడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి మార్చి 5న జిమ్‌కి వెళ్తున్న బాలుడిని కిడ్నాప్ చేసి, అడవికి తీసుకెళ్లి కట్టేసి బెదిరించారు. ఆ తర్వాత బాలుడిపై అత్యాచారం చేసి, తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని సైతం బావిలో పడేసి పరారయ్యారు.

అయితే మరోవైపు మార్చి 5న బాలుడు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం, బాలుడి నివసించే ప్రాంతంలోనే నివసించే హుస్సేని బాలుడి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి, కిడ్నాపర్లు ఏదైనా మెసేజ్ పంపారా..? ఆరా తీశాడు. వారి ఫోన్లు చెక్ చేసుకోమని చెప్పగా.. కుటుంబీకులు మొబైల్ ఫోన్ చెక్ చేశారు. అప్పుడు బాలుడి మామ ఫోన్‌లో రూ. 10 లక్షలు డబ్బు కావాలంటూ కోరుతూ మెసేజ్ కనిపించింది.
అయితే బాలుడు కిడ్నాపైన రోజు రాత్రి హుస్సేనీ అదృశ్యమైనట్లు, తెల్లవారుజామున మళ్లీ ఇంటి వద్దే ఉన్నట్లు బాలుడి కుటుంబీకులు గుర్తించారు. పోలీసులు వచ్చి ప్రశ్నించిన తర్వాత, అతడు చెప్పే మాటల్లో తేడాలు కనిపించాయి. చివరకు హుస్సేని లొంగిపోయి, ఆ బాలుడి హత్యలో తనతో పాటు అజార్ ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకున్నాడు. ఇద్దరు నిందితులు కూడా బాలుడిని కాల్-గర్ల్ ని కలవడానికి తీసుకెళ్తున్నామని మాయమాటలు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. హుస్సేనిని అరెస్ట్ చేయగా, అజార్‌ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగున్నట్లు డీసీపీ తెలిపారు.












Click it and Unblock the Notifications