వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు వలసకూలీల మృతి, శ్రామిక్ రైల్లోనే విగతజీవులుగా.. మరో ఐదుగురు కూడా

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ వల్ల వలసకూలీల బతుకు దుర్భరంగా మారింది. సొంతగూటికి వెళ్లేందుకు శ్రామిక్ రైళ్లను ఆశ్రయిస్తే.. కొందరు లెక్క తప్పుతోంది. మరికొందరినీ ఇతర స్టేషన్లలో దింపుతున్నారు. అయితే బుధవారం మాత్రం శ్రామిక్ రైలులో ఇద్దరు వలసకూలీలు చనిపోవడం కలచివేసింది. అయితే వారి మృతికి గల కారణం మాత్రం తెలియరాలేదు.

 ఇద్దరి మృతి..

ఇద్దరి మృతి..

ముంబై లోకమాన్య తిలక్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి శ్రామిక్ రైలు బుధవారం చేరుకుంది. అందులో రెండు మృతదేహాలను రైల్వే సిబ్బంది గుర్తించారు. ఉదయం 8.21 గంటలకు రైలు చేరుకుంది. ఒక్కొ ప్రయాణికులు దిగిపోగా.. మృతదేహాలను సిబ్బంది గుర్తించారు. వారి డెబ్ బాడీస్ యార్డుకు తరలించి.. రైలు బోగీలను శుభ్రపరిచి... తర్వాత శానిటైజ్ చేశారు. కూలీల మృతికి గల కారణం మాత్రం తెలియరాలేదు.

 అటాప్సీ తర్వాత..

అటాప్సీ తర్వాత..

మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోందని.. నివేదికలో ఏం జరిగిందో తెలుస్తుందని రైల్వే అధికార ప్రతినిధి అశోక్ కుమార్ తెలిపారు. వారిద్దరికీ ఆరోగ్యం బాగోలేదు అని భావిస్తున్నానని చెప్పారు. వారిలో ఒకరు దశరత్ ప్రజాపతి.. యూపీలోని జౌన్ పూర్ ఇతని స్వగ్రామం. ముంబైలో ఉండగానే ఇతను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డాడు. అలహాబాద్ వద్దకు చేరుకోగా ఆరోగ్య సమస్య వచ్చిందని.. తర్వాత పడకొని చనిపోయాడని తెలిపారు. వారణాసి వచ్చిన లేవలేదు అని పేర్కొన్నారు.

Recommended Video

A Boy Sleeps On Suitcase Wheeled By Mother Video Gone Viral
 బీహర్‌లో కూడా

బీహర్‌లో కూడా

అజాంఘడ్ జిల్లాకు చెందిన రామ్ రతన్ అని మరొకరిని గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగిస్తామని చెప్పారు. బుధవారం ఒక్కరోజే శ్రామిక్ రైళ్లలో వచ్చిన ఏడుగురు వలసకూలీలు చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే వారికి అంతకుముందే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఏడుగురిలో నలుగురు బీహార్, ముగ్గురు యూపీ ప్రయాణించారని తెలిపారు. కరోనా వైరస్ వల్ల పని లేక, మనీ లేక కూలీలు ఇబ్బంది పడ్డారు. దీంతో పొట్ట చేత పట్టుకొని స్వస్ధలాలకు వెళుతున్నారు.

English summary
Two people were found dead on a Shramik Express train that came from Mumbai to Uttar Pradesh's Varanasi on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X