Monkey Fever: వణికిస్తున్న మంకీ ఫీవర్.. ఇప్పటికే ఇద్దరు మృతి.. లక్షణాలివే..!
కరోనా తర్వాత ఏదో ఒక వ్యాధి బయటపడుతూనే ఉంది. కొద్ది నెలల క్రితం నిఫా వైరస్ అందరిని భయపెట్టగా.. తాజాగా మంకీ ఫీవర్ వణికిస్తుంది. ఇప్పటికే ఈ మంకీ ఫీవర్ తో ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం కర్ణాటకలో మంకీ ఫీవర్ భయాలు నెలకొన్నాయి. ఆ రాష్ట్రంలో ఈ ఫీవర్ తో ఇద్దరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపూర్ తాలూకాలో గత 12 రోజుల్లో 25 మంది మంకీ ఫీవర్ బారిన పడ్డారని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.
కన్నడ జిల్లాలోని సిద్దాపూర్ తాలూకాకు చెందిన 21 మందికి గత శనివారం వరకు కయాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. మంకీ ఫీవర్ వచ్చిన ఇద్దరు మృతి చెందారు. శివమొగ్గ జిల్లా చెందిన ఓ యువతి, ఉడుపి జిల్లాకు చెందిన ఓ మృద్ధు మంకీ ఫీవర్ తో చనిపోయారు.వ్యాధి సోకిన వారు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వారంలోపు వారు కోలుకుంటారని వైద్యుడు నీరాజ్ తెలిపారు.

కర్ణాటకలో అధికారులు ఇప్పటివరకు 2,288 నమూనాలను తీసుకుని పరీక్షించారు. ఇందులు 49 మందికి మంకీ ఫీవర్ వచ్చినట్లు గుర్తించారు. మంకీ ఫీవర్ పై అవగాహన అవసరమని వైద్యులు చెబుతున్నారు. కోతులను కరిచే కీటకాలు మనుషులను కుడితే ఈ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంటుందట. మంకీ ఫీవర్ లక్షణాలు చూసినట్లైతే ఒళ్లు నొప్పులు, తలనొప్పి, తీవ్రమైన జ్వరం ఉంటుందట. అయితే మంకీ ఫీవర్ ను త్వరగా గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని చెబుతున్నారు.
మంకీ ఫీవర్ అనేది అంటు వ్యాధి కాదని చెబుతున్నారు. మంకీ ఫీవర్ వచ్చిన వారు సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే వయవ వైఫల్యం, మూత్రపిండాల వైఫల్యం, హెపటైటిస్, అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుందట.












Click it and Unblock the Notifications