కారు పార్కింగ్ గొడవ: ఇద్దరు సోదరుల కాల్చివేత

ఈ సంఘటన శుక్రవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతి చెందిన సోదరులను షాదాబ్ సింగ్, కప్తాన్ సింగ్‌లుగా గుర్తించారు. రాహుల్ అలియాస్ కలుతో అతని కారు పార్కింగ్‌పై వారు గొడవ పడినట్లు తెలుస్తోంది.
రాహుల్ వారిపై కాల్పులు జరిపి తన కారులో పారిపోయాడు. ఇద్దరు సోదరులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించారు. రాహుల్ ఆ ప్రాంతంలోని కరుడు గట్టిన నేరస్థుడని తెలుస్తోంది.
రాహుల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతని కారు నెంబర్‌ను అన్ని ప్రాంతాలవారికి తెలియజేసి, అతను పారిపోకుండా రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications