పాక్ కాల్పుల్లో ఇద్దరు భారత జవానుల మృతి
జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. భారత్‌పై పై చేయి సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తోంది. దీంతో పలుసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అంతర్జాతీయంగా కశ్మీర్ సమస్యను తీసుకెళ్లడంతో పాటు భారత సరిహద్దు ప్రాంతంలో పలుసార్లు కాల్పులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. దీంతో ఇద్దరు భారత జవాన్లతో పాటు ఒక పౌరుడు మృతి చెందాడు.
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో కాల్పులు జరపడంతో ఇద్దరు భారత జవాన్లతో పాటు ఒక పౌరుడు మృతి చెందాడు. పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని దీంతో జిల్లాలోని పలు గ్రామాలు సైతం దాడుల్లో దెబ్బతిన్నాయని భారత అధికారులు తెలిపారు.

గత వారం రోజుల క్రితమే ఎల్‌ఓసీ వెంట ఉన్న బారముల్లా, మరియు రాజౌలి ప్రాంతంలో కాల్పులు విరమణ ఉల్లంఘించింది. భారత ఆర్మిపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు భారత ఆర్మీ అధికారులు మృతి చెందారు.
కాగా జూలైలో 296 సార్లు, ఆగస్టులో 307 సార్లు సెప్టెంబర్‌లో 292 సార్లు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్దంగా వ్యవహరించారని మొత్తం మీద గత సంవత్సరం నుండి 2050 సార్లు పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలు జరగగా మొత్తం 21 మంది ప్రజలు మృతి చెందినట్టు భారత అర్మి అధికారులు ప్రకటించారు. అయితే పాకిస్తాన్ క్వింపు చర్యలకు భారత అధికారులు కూడ పలుసార్లు తీవ్రంగా స్పందించినా పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు ఫుల్‌స్టాప్ పెట్టడం లేదు.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications