ఉగ్ర మూకల దొంగ దెబ్బ.. పోలీసుల తలలో బుల్లెట్లు..

జమ్మూ కాశ్మీర్‌లోని అటవీ ప్రాంతాల్లో రక్షణ విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మరోసారి కన్నుశారు. కిష్ట్వార్ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తూ విధి నిర్వహణలో అదృశ్యమైన ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (SPO) ప్రాణాలు కోల్పోయిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. దట్టమైన అడవుల గుండా తమ సహచరులకు డ్యూటీ అప్పగించేందుకు వెళ్తున్న సమయంలో చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని, భద్రతా దళాల్లో ఆగ్రహాన్ని నింపింది.

పెట్రోలింగ్ నిర్వహిస్తూ అదృశ్యం

కిష్ట్వార్ జిల్లా దచ్చన్-మర్వా సరిహద్దుల్లోని దుర్గమమైన ధేర్నా పోస్ట్ వైపు రష్పాల్ కుమార్ (40), బాబీ చంద్ (54) అనే ఇద్దరు ఎస్పీఓలు తమ విధుల్లో భాగంగా... పెట్రోలింగ్ నిర్వహించిన అనంతరం, పోస్ట్ వద్ద ఉన్న తమ సహచర సిబ్బందికి విధులు అప్పగించేందుకు వీరు బయలుదేరారు. అయితే, వారు ఎంతసేపటికీ గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో అనుమానం వ్యక్తమైంది. మొదట్లో వారి మొబైల్ ఫోన్లు రింగ్ అయినప్పటికీ, ఆ తర్వాత ఒక్కసారిగా స్విచ్ఛాఫ్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Two Special Police Officers Found Dead In Jammu Kashmir Kishtwar District After Going Missing On Duty

అంబష్ చేసి కాల్చివేత.. ఆయుధాలు మాయం

రహస్యంగా పొంచి ఉన్న ఉగ్రవాదులు లొకేషన్‌ను ఆధారం చేసుకుని అకస్మాత్తుగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు అధికారుల శరీరాలపై బుల్లెట్ గాయాలు లభ్యమయ్యాయి. ఉగ్ర మూకలు అత్యంత దారుణంగా ఒకరి తలపై, మరొకరి వీపుపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసినట్లు ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయి. దారుణానికి ఒడిగట్టిన అనంతరం, ఆ అధికారులు ధరించిన ఇన్సాస్, 303 రైఫిళ్లను ఉగ్రవాదులు తమతో పాటు ఎత్తుకెళ్లారు.

తోటి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు.. నలుగురు మృతి
తోటి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు.. నలుగురు మృతి

జల్లెడ పడుతున్న దళాలు

ఎస్పీఓల అదృశ్యంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీస్, భారతీయ సైన్యం సంయుక్తంగా రంగంలోకి దిగి విస్తృత శోధన చేపట్టాయి. గంటల పాటు కొనసాగిన సెర్చ్ ఆపరేషన్ తర్వాత ధేర్నా టాప్ పరిసర ప్రాంతాల్లో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా దళాలు అటవీ ప్రాంతాన్ని నలువైపులా దిగ్బంధించి, ఘాతుకానికి పాల్పడిన మూకల కోసం గాలింపు చర్యలను మరింత ఉధృతం చేశాయి.

మరో భారీ ఉగ్రదాడి.. డీఎస్పీ సహా 11 మంది పోలీసులు మృతి.. 12 మందికి సీరియస్
మరో భారీ ఉగ్రదాడి.. డీఎస్పీ సహా 11 మంది పోలీసులు మృతి.. 12 మందికి సీరియస్

అటవీ ప్రాంతాల్లో పొంచి ఉన్న ముప్పు

కిష్ట్వార్ జిల్లాలోని దట్టమైన కొండలు, అటవీ ప్రాంతాలు గత కొంతకాలంగా ఉగ్రవాద నిర్మూలన చర్యలకు కేంద్రబిందువుగా మారాయి. భద్రతా దళాలు వరుసగా చేపట్టిన ఆపరేషన్లతో ఇప్పటికే అనేక మంది ముష్కరులు హతమవ్వగా, మిగిలిన కొద్దిమంది మూకలు ఇలాంటి దొంగ దాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల కాలంలోనే మరొక పోలీస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటుచేసుకోగా, తాజా ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+