"వెయ్యి నోటు కంటే.. కొత్తగా వచ్చిన రెండు వేల నోటు చిన్నది"
న్యూఢిల్లీ : దేశమంతా కొత్త నోట్ల మాటే. బ్యాంకులకు వెళ్లి కొత్త నోట్లు అందుకున్నవారు.. వాటిని మురిపెంగా పర్సుల్లో పెట్టేసుకుంటున్నారు. బ్యాంకులన్నీ విపరీతమైన రద్దీగా మారడంతో.. సామాన్యులకు ఇబ్బందులు తప్పట్లేదు. కాగా, రూ.2వేల నోటుకు సంబంధించి ఇప్పుడో ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
అదేంటంటే.. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన రూ.2వేల కొత్త నోటు వెయ్యి నోటు కంటే చిన్నది. అయితే ఇది విలువలో కాదు కేవలం పరిణామంలో మాత్రమే. సాధారణంగా ఆర్బీఐ రూపొందించే కరెన్సీని పరిశీలిస్తే.. రూ.10,20,50,100 నోట్లన్ని విలువ పెరిగిన కొద్ది నోట్ల సైజు కూడా పెరుగుతుంటుంది. కానీ ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల చేసిన రూ.2వేల నోటు వెయ్యి నోటు కంటే పరిమాణంలో చిన్నది కావడం గమనార్హం.













Click it and Unblock the Notifications