నిద్రమాత్రలు కలిపాడు: ఆంటీ, అమ్మాయిని అడవిలో రేప్ చేసిన డ్రైవర్, చివరికి!

బలసూర్(ఒరిస్సా): నిద్రమాత్రలు కలిపిన ఆహారం ఇచ్చి వివాహిత మహిళతో పాటు యువతి మీద డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన ఓరిస్సాలోని బలసూర్ జిల్లాలోని సోరో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అత్యాచారం జరిగిందని తెలుసుకున్న యువతి ఆత్మహత్యాయత్నం చేసింది.

బాధితులను సోరో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని సరో పోలీస్ స్టేషన్ ఇన్స్ ఫెక్టర్ మల్లిక్ చెప్పారు. మనిత్రీ గ్రామంలో నివాసం ఉంటున్న వివాహిత మహిళ, ఓ యువతి (ఇద్దరూ గిరిజనులు) ప్రతి రోజూ కూలి పనికి వెలుతుంటారు.

Two tribal woman allegedly raped by tractor driver in Odisa

ఎప్పటిలాగే వివాహిత మహిళ, యువతి ట్రాక్టర్ లో కూలి పని కోసం సోరో ప్రాంతానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ట్రాక్టర్ డ్రైవర్ ముందుగానే నిద్రమాత్రలు కలిపిన ఆహారం ఇద్దరికీ ఇచ్చాడు. తరువాత ఇద్దరూ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే డ్రైవర్ సమీపంలోని అటవి ప్రాంతంలోకి ట్రాక్టర్ తీసుకెళ్లాడు.

ట్రాక్టర్ లోనే సాయంత్రం వరకు ఇద్దరు మహిళల మీద పదేపదే అత్యాచారం చేశాడు. చివరికి ఇద్దరిని రోడ్డు పక్కన తోసేసి పరారైనాడు. తరువాత స్పృహలోకి వచ్చిన ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. తన మీద అత్యాచారం జరిగిందని తెలుసుకున్న యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు చెప్పారు. గిరిజన మహిళల మీద అత్యాచారం చేసిన ట్రాక్టర్ డ్రైవర్ పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి మల్లిక్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+