ఇదెక్కడి గోల?: ఐసీయూలో భర్త.. అతడి ఎదురుగానే సిగపట్లకు దిగిన భార్యలు!

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన షాదాబ్ అలీ అంబులెన్స్ డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన వివాహిత ప్రేమలతతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత కొంతకాలానికి అలీకి అస్మా అనే మరో యువతితో వివాహమైంది.

గ్వాలియర్: ఇద్దరు పెళ్లాల పోరు భరించలేక భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అతడి ఎదురుగానే ఇద్దరి భార్యలు పరస్పరం కుమ్మేసుకున్నారు. దీంతో ఆస్పత్రి కాస్తా, రణరంగంగా మారిపోయింది.

ఇంతకీ విషయం ఏమింటంటే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన షాదాబ్ అలీ అంబులెన్స్ డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన వివాహిత ప్రేమలతతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత కొంతకాలానికి అలీకి అస్మా అనే మరో యువతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు.

Two wives fight in Gwalior hospital ICU - with tubes hanging husband tries to break it up

పెళ్లయినా కూడా అలీ.. ప్రేమలతతో తన ప్రేమ బంధాన్ని తెంచుకోలేకపోయాడు. విషయం కాస్తా బయటికి పొక్కడంతో ఆస్మా, ప్రేమలత మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆ తర్వాత కొంతకాలానికి ప్రేమలత తన భర్తను వదిలేసి ఏకంగా అలీ వద్దకే వచ్చేసింది. దీంతో అస్మా, ప్రేమలత మధ్య గొడవలు కామన్ అయిపోయాయి.

వీరి గొడవలు భరించలేనంత స్థాయికి చేరడంతో ఏం చేయాలో అర్థంకాని అలీ ఇటీవల విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని సమీపంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.

ప్రస్తుతం అలీ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో ఉన్న భర్తను చూసుకునేందుకు భార్యలు ఇద్దరూ తరచూ ఆసుపత్రికి వస్తుండేవారు. ఈ క్రమంలో ఐసీయూ రూములో ఎదురుపడిన ప్రేమలత, అస్మాలు మరోసారి గొడవపడ్డారు. అది కాస్తా ముదరడంతో ఐసీయూలోనే జుట్లు పట్టుకున్నారు. పెద్దగా అరుస్తూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు.

ఓ వైపు భర్త అలీ ఆసుపత్రిలో బెడ్ పై ఉంటే మరోవైపు వీరిద్దరూ కయ్యానికి దిగారు. దీంతో వారిని ఆపేందుకు అలీ యత్నించగా అతడి చేతికున్న సెలైన్ పైపు ఊడిపోయింది. ఈలోగా వీరి అరుపులు విన్న ఆస్పత్రి సిబ్బంది వచ్చి వారిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+