ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఆర్ టీసీ బస్సులో చెప్పులతో కొట్టుకున్న లేడీస్, ఫ్రీగా తిరగమంటే ఫ్రీగా కొట్టుకున్నారు !

ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి కొన్ని నెలలు అయ్యింది. ఇలా కేఎస్‌ఆర్‌టీసీ మాత్రమే కాదు బీఎంటీసీ బస్సులు కూడా ఎప్పుడూ మహిళలతో పూర్తిగా నిండిపోతాయి. బస్ స్టేషన్‌లో దాదాపు 100 మంది మహిళలు 40 సీట్ల బస్సు కోసం వేచి ఉండటం సర్వసాధారణంగా మారిపోయింది. ఆర్ టీసీ బస్సులో మహిళలు చెప్పులతో కొట్లాడుకుంటున్న దృశ్యం వైరల్‌గా మారింది.

బెంగళూరులో రద్దీగా ఉండే బస్సులో ఇద్దరు మహిళలు చెప్పులతో ఒకరిని ఒకరు కొట్టుకుని పోట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనను బస్సులోని ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాకేష్ ప్రకాష్ అనే వ్యక్తి ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశాడు. ఇందులో ముందు సీటులో కూర్చున్న మహిళ వెనుక కూర్చున్న మహిళను చెప్పుతో కొట్టడం కనిపించింది.

Two women slapped each other for a seat in an RTC bus in Karnataka

ప్రతిగా ఒకరితో ఒకరు పోట్లాడుకునే సన్నివేశం కనిపించింది. వెనుక కూర్చున్న మహిళ కిటికీ తెరవడంతో ఇద్దరు మహిళలు బూట్లతో గొడవకు దిగారు. బస్సులోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని ఇద్దరు మహిళలకు సర్దిచెప్పి గొడవను విరమింపజేశారు. బస్ కండక్టర్ కూడా గొడవకు దిగాడు. అయితే ఇతర ప్రయాణికులు బస్సు దిగాలని పట్టుబట్టడంతో ఇద్దరు మహిళలు మౌనంగా కుర్చున్నారు.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించిన వెంటనే సోషల్ మీడియా నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. పోస్ట్‌ల్లో ప్రజలు వారి అభిప్రయాలు పంచుకుంటున్నారు. అయితే మరికొందరు బస్సు ప్రయాణాల్లో ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆర్ టీసీ బస్సులో చెప్పులతో కొట్టుకోవడంతో కర్ణాటక రవాణా శాఖ అధికారులు హడలిపోయారు.

Two women slapped each other for a seat in an RTC bus in Karnataka

గతేడాది బీదర్ జిల్లాలో ఇద్దరు మహిళలు బస్సు సీటు కోసం గొడవ పడిన దృశ్యం వైరల్‌గా మారింది. భాల్కీ నుంచి హల్లిఖేడా వెళ్తున్న బస్సులో చలాకాపూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు కూడా చోటు కల్పించాలని ఓ మహిళ కోరడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మాటకు మాట పెరిగిపోవడంతో ఇద్దరూ చేతులు కలిపే స్థాయికి చేరింది. మహిళలు పోట్లాడుకునే సమయానికి ప్రయాణికులు సైతం షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+