రెండేళ్లు పిల్లాడు లైంగికంగా వేధించాడా?: మహిళ షాకింగ్ ఫిర్యాదు..
నిజానికి సదరు మహిళ భర్తపై అంతకుముందు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైందని, ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు తమపై కక్ష కట్టారని బాలుడి తండ్రి పేర్కొన్నాడు.
పాట్నా: రెండేళ్ల వయసంటే ఇంకా అమ్మ ఒడికి కూడా దూరం కాని ప్రాయం. మాటలు కూడా అప్పుడప్పుడే వచ్చే పరిస్థితి. అంత చిన్న వయసులో మరొకరిపై లైంగిక వేధింపులకు పాల్పడటమనేది జరుగుతుందా? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఓ మహిళ మాత్రం తనపై ఓ రెండేళ్ల చిన్నోడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు పెట్టింది.
బీహార్ రాజధాని పాట్నాకు 153కి.మీ దూరంలో ఉన్న చంపారన్ జిల్లా పతాహి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. గత నెల 15న కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల బాలుడు తనను లైంగికంగా వేధించి, తన బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడని 35 ఏళ్ల మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

మహిళ ఫిర్యాదు మేరకు దొంగతనం నేరారోపణపై సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు బాలుడి తండ్రి మాత్రం ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర అని అభిప్రాయపడుతున్నాడు. మహిళ పెట్టిన ఫిర్యాదుతో రెండేళ్ల తన కొడుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
నిజానికి సదరు మహిళ భర్తపై అంతకుముందు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైందని, ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు తమపై కక్ష కట్టారని బాలుడి తండ్రి పేర్కొన్నాడు. తన తండ్రిని తీవ్రంగా గాయపరిచినందుకు వారిపై ఈ కేసు పెట్టినట్లు తెలిపాడు.
గ్రామ పెద్ద సునీల్ కుమార్, సదరు మహిళ భర్తతో కలిసి తమపై ఒత్తిడి తెస్తున్నాడని, ఇన్ స్పెక్టర్ కూడా వారికే అనుకూలంగా వ్యవహరిస్తూ.. కేసును విత్ డ్రా చేసుకోవాల్సిందిగా భయపెడుతున్నారని బాలుడి తండ్రి ఆవేదన చెందాడు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. సదరు మహిళ ఇచ్చిన బూటకపు ఫిర్యాదుతో తమను వేధించడం సరికాదని అన్నాడు.












Click it and Unblock the Notifications