• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అగస్టావెస్ట్‌లాండ్ కేసు: మోడీ కృషి వల్లే భారత్‌కు క్రిస్టియన్ మైఖేల్ అన్న యూఏఈ దౌత్యవేత్త

|

అగస్టా‌వెస్ట్‌లాండ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్‌ను భారత్‌కు రప్పించడంలో ప్రధాని మోడీ కృషి ఎంతో ఉందని కొనియాడారు ఇండియాలో యూఏఈ దౌత్యవేత్త అహ్మద్ అల్ బన్నా. ఢిల్లా అబుదాభిల మధ్య ఉన్న మంచి స్నేహంతోనే క్రిస్టియన్ మైఖేల్‌ను భారత్‌కు అప్పగించగలిగామని అహ్మద్ తెలిపారు.

ఇరు దేశాల మద్య వ్యూహాత్మక బంధం బలపడటంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఇలాంటి నిర్ణయాలు ఒక ఏడాదిలోనో లేక ఒక్కరోజులోనో జరిగిపోవని చెప్పారు. గతేడాది డిసెంబరులో మైఖేల్‌ను యూఏఈ నుంచి భారత్‌కు రప్పించడం జరిగింది. అగస్టా వెస్ట్‌లాండ్ కేసును సీబీఐ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్‌లు విచారణ చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి యూఏఈ భారత్‌ల మధ్య క్విడ్‌ప్రొకో వ్యవహారం నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి.

UAE envoy credits PM Modi for Christian Michels extradition

యూఏఈ ప్రధాని షేక్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్టూమ్ కుమార్తె యువరాణి లతీఫాను గతేడాది మార్చిలో భారత్‌లోకి ప్రవేశించడంతో ఆమెను పట్టుకుని తిరిగి అబుదాబికి అప్పగించింది భారత్. అయితే భారత అధికారులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేశారు. అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. అదే సమయంలో యూఏఈ కూడా భారత్ అబుదాబిల మధ్య బంధాలు బలపడ్డాయి. ఇలా మరే దేశంతోను అబుదాబి ఇంతటి మంచి సంబంధాలు కొనసాగించలేదు.

English summary
UAE ambassador to India, Ahmed Al Banna, has said it was the personal touch between the leadership of New Delhi and Abu Dhabi that led to the extradition of Christian Michel.Michel is the alleged middleman in the VVIP AgustaWestland chopper deal case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X