UAE Vs NZ: క్రికెట్‍లో సంచలనం సృష్టించిన యూఏఈ.. న్యూజిలాండ్ పై గెలుపు..
ప్రపంచ క్రికెట్ లో పసికూన యూఏఈ సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్ ను ఓడించి సంచలనం రేపింది. మూడు టీ20 సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ యూఏఈలో పర్యటిస్తుంది. శనివారం న్యూజిలాండ్ తో యూఏఈతో తలపడింది. ఈ మ్యాచ్ లో యూఈఏ న్యూజిలాండ్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటగా టాస్ గెలిచిన యూఏఈ టాస్ గెలిలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ ఓ దశలో 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన జట్టును మార్క్ చైన్ మాన్ ఆదుకున్నాడు. మార్క్ చైన్ మాన్ 46 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్ లతో 63 పరుగులు చేశాడు. నషిమ్ 17 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. బోవెస్ 2 ఫోర్లు, ఒక సిక్స్ తో 21 పరుగులు చేశాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. యూఏయీ బౌలర్లలో ఆయాన్ ఖాన్ మూడు వికెట్ల పడగొట్టగా.. జవదుల్లా రెండు వికెట్లు, అలీ నసీర్, జహుల్ ఖాన్, ఫరజుద్దీన్ ఒక్కో వికెట్ తీశారు.

143 పరుగలు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మహ్మద్ వసీం 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 55 పరుగులు చేశాడు. అసిఫ్ ఖాన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ తో 48 పరగులు చేశాడు. వ్రిత్య అర్వింద్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సింక్స్ లు 25 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథి, సాంటిర్న్, జేమిసన్ ఒక్కో వికెట్ తీశారు. కాగా ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ ఆదివారం ఐర్లాండ్ తో తలపడనుంది. మొదటి టి20 భారత్ ఘన విజయం సాధించింది.












Click it and Unblock the Notifications