Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాక్: పీకలదాక మద్యం తాగిన ఉబర్ డ్రైవర్, ఇంటి వరకు కారు నడిపిన ప్రయాణికుడు !

బెంగళూరు: రాత్రి ఇంటికి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకున్న ప్రయాణికుడికి ఉబర్ క్యాబ్ డ్రైవర్ సినిమా చూపించాడు. పీకలదాక మద్యం సేవించి కారు నడపడానికి ప్రయత్నించిన డ్రైవర్ తీరుచూసి ప్రయాణికుడు షాక్ కు గురైనాడు. రాత్రిపూట విదిలేని పరిస్థితుల్లో ప్రయాణికుడు తన ఇంటి వరకు కారు నడిపాడు.

ఉబర్ క్యాబ్ డ్రైవర్ వాహనం నడిపితే తాను వెళ్లేది ఇంటికి కాదని, పైలోకాలకు అని గ్రహించిన ప్రయాణికుడు అతనే డ్రైవర్ అవతారం ఎత్తి వాహనం నడిపి ఎలాంటి ప్రమాదం లేకుండా ఇంటికి చేరుకున్నాడు. తనకు ఎదురైన అనుభవం గురించి ఆ ప్రయాణికుడు సోషల్ మీడియాలో వివరించాడు.

Uber cab driver drunk passenger drives car Airport to Bengaluru

సూర్య ఓరుగంటి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి బెంగళూరులోని ఇంటికి చేరుకోవడానికి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. క్యాబ్ నెంబర్ మొబైల్ లో చూసుకుని వాహనం దగ్గరకు వెళ్లాడు. అప్పటికే కారు డ్రైవర్ పీకలదాక మద్యం సేవించి ఉన్నాడని సూర్య ఓరుగంటి గుర్తించాడు.

డ్రైవర్ వాహనం నడపడానికి వీలుకానంత మద్యం సేవించాడు. ఇక విదిలేని పరిస్థితుల్లో సూర్య కారు డ్రైవర్ ను ముందు సీటులో కుర్చోపెట్టాడు. తాను వాహనం నడపలేనని, మీరు వాహనం నడిపితే ఇంటి వరకు వదిలి పెడుతానని డ్రైవర్ చెప్పాడు.

సూర్య డ్రైవర్ సీటులో కుర్చుని కారు డ్రైవర్ తీరును వీడియో, ఫోటో తీశాడు. తరువాత బెంగళూరులోని ఇంటి వరకు సూర్య కారు నడిపాడు. డ్రైవర్ పీకలదాక మద్యం సేవించి మతిలేకుండా సీటులో పడి ఉన్న ఫోటో, వీడియో తీసిన సూర్య దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నందుకు తనకు ఎదురైన అనుభవం ఇది అంటూ సూర్య సోషల్ మీడియాలో వివరించాడు. మద్యం మత్తులో ఇలాంటి డ్రైవర్లు జాతీయ రహదారిలో వాహనాలు నడిపి ఎదైన ప్రమాదం జరిగితే దానికి ఎవరు భాద్యులు అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+