వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్దంలో చూస్తూ ఉబేర్ డ్రైవర్ హస్తప్రయోగం

|
Google Oneindia TeluguNews

కోల్ కతా: ఉబర్ క్యాబ్ డ్రైవర్లు రోజు రోజుకు ఒంటరిగా వెళుతున్న మహిళా ప్రయాణికుల పట్లు నీచంగా ప్రవర్థిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ఉబేర్ క్యాబ్ డ్రైవర్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్థించి అరెస్టు అయిన సంఘటన కోల్ కతా నగరంలో జరిగింది.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 8వ తేదిన రాత్రి 7 గంటల సమయంలో కోల్ కతా లోని ఎల్జీన్ రోడ్డులో 25 సంవత్సరాల యువతి ఉబేర్ క్యాబ్ నిలిపింది. నేతాజీనగర్ కు వెళ్లాలని డ్రైవర్ పింటూ యాదవ్ కు చెప్పి కారులో కుర్చుంది.

తరువాత పింటూ యాదవ్ కారు ముందకు నడిపాడు. కారు అద్దం సరి చేసి యువతిని చూడటం మొదలు పెట్టాడు. ఒక్క చేతితో కారు డ్రైవింగ్ చేస్తు మరొ చేతితో హస్త ప్రయోగం చేసుకుంటు అద్దంలో ఆమెను చూస్తు వెకిలి చేష్టలు చెయ్యడం మొదలు పెట్టాడు.

 Uber driver arrested for allegedly masturbating in Kolkata

ఆ సందర్బంలో కేకలు వేస్తే తనను ఏమైనా చేస్తాడని యువతి భయపడింది. నేతాజీ నగర్ లోని ఇంటి దగ్గరకు చేరుకున్న తరువాత కారులో నుండి కిందకు దూకి ఇంటిలోకి పరుగు తీసింది. స్నేహితులు ధైర్యం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విషయం తెలుసుకున్న పోలీసులు గాలించి సోమవారం కారు డ్రైవర్ పింటూ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి పింటూ యాదవ్ ను అరెస్టు చేశారు. తరువాత బెయిల్ మీద విడుదల చేశారు. విషయం తెలుసుకున్న ఉబేర్ సంస్థ పింటూ యాదవ్ ను ఉద్యోగంలో నుండి తొలగించింది. అతను తప్పుడు పత్రాలు సమర్పించి ఉబేర్ సంస్థలో ఉద్యోగంలో చేరాడని పోలీసులు తెలిపారు.

English summary
According to the police the woman hired a taxi from Elgin Road to Netaji Nagar on July 8 at about 7 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X