విదేశీ మహిళతో ఉబెర్ డ్రైవర్ వెకిలి చేష్టలు

ముంబై: విదేశీ ప్రయాణికురాలితో ఉబెర్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను ఏదో విధంగా ముట్టుకోవాలని ప్రయత్నించి చివరికి జైలుపాలైనాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఓ విదేశీ మహిళ ముంబైలోని బాంద్రా నుంచి వెర్సోవాకు వెళ్లడానికి ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది. బుధవారం రాత్రి ఉబెర్ కారు డ్రైవర్ షాబాజ్ షేక్ (32) బాంద్రా దగ్గరకు వెళ్లాడు. తరువాత విదేశీ మహిళ కారు వెనుక సీట్లో కుర్చోన్నారు.

Uber driver arrested for molesting foreigner in Mumbai

ఆ సమయంలో ముందు సీట్లో వచ్చి కుర్చోవాలని ఆమెకు షాబాజ్ షేక్ చెప్పాడు. ముందు సీట్లో కుర్చోవడానికి విదేశీ మహిళ నిరాకరించింది. తరువాత షాబాజ్ షేక్ వెనుక సీటు శుభ్రం చెయ్యాలని చెప్పి సీటు తుడిచినట్ల నటిస్తూ ఆమె శరీరాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించాడు.

భయంతో ఆమె కేకలు వేస్తూ కారు దిగి పరుగు తీసింది. వెంటనే శాంతాక్రజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విదేశీ మహిళ స్నేహితురాలు ఫేస్ బుక్ లో ఈ వివరాలు వెల్లడించింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు.

షాబాజ్ షేక్ ను ఉద్యోగం నుంచి తొలగించామని ఉబెర్ సంస్థ తెలిపింది. విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన షాబాజ్ షేక్ ను ముంబై నగర పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+