ఢిల్లీ రేప్ షాక్: హెడ్మాస్టర్ కొడుకు, సీరియల్ రేపిస్ట్, బార్ డ్యాన్సర్‌తో...

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన యువతి పైన అత్యాచారం చేసిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌కు సంబంధించిన ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి. 2011లోనే అతను జైలులో గడిపి వచ్చినట్లుగా సోమవారం వెలుగులోకి రాగా.. తాజాగా మరిన్ని బయటకు వస్తున్నాయి.

సమాచారం మేరకు.. ఆ డ్రైవర్ 2013లో కూడా అరెస్టయ్యాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొయిన్ పురిలో అతని పైన అత్యాచారం కేసు నమోదయింది. ఈ కేసులో అతను జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్ పైన బయటకు వచ్చాడు. అంతేకాదు, అతను 2006 కూడా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో అరెస్టయ్యాడు.

కాగా, శివకుమార్ యాదవ్ 2011లో బార్ డ్యాన్సర్ పైన అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అప్పుడు అతను ఏడు నెలల పాటు జైలులో ఉన్నాడు. అనంతరం ఈ కేసులో అతను బయటకు వచ్చాడు. బాధిత మహిళ, నిందితుడి మధ్య రాజీ కుదరడంతో అతను బయటకు వచ్చాడు. 2011లో దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.

Uber driver was arrested for rape in 2011 and also in 2013

నాలుగు రోజుల క్రితం అతను మరో అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. నిందితుడు శివకుమార్ యాదవ్ మూడు అత్యాచారాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 6వ తేదీన మహిళా ఎగ్జిక్యూటివ్ పైన రేప్‌కు పాల్పడ్డాడు. ఇది మూడో అత్యాచారం.

తల్లిదండ్రుల నిరాకరణ

శివకుమార్ యాదవ్‌ను అతని తల్లిదండ్రులు ఏడాది క్రితమే వద్దనుకున్నారు. అతని ప్రవర్తన నచ్చని వారు అతనిని కొడుకుగా భావించలేదు. అతని తండ్రి వయస్సు 76. అతను రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఇతను తన భార్య, మరో వికలాంగుడైన కొడుకుతో కలిసి జీవిస్తున్నారు.

శివకుమార్ యాదవ్ మరో సోదరుడు 2010లో మృతి చెందాడు. ఇతను విడోను పెళ్లి చేసుకొని, ఢిల్లీకి వచ్చాడు. ఇతను హైస్కూల్ నుండే చెడు సావాసాలకు అలవాటుపడ్డాడు. దీంతో చదువు ఒంటబట్టలేదు. ఇతని పైన గూండా యాక్ట్, ఆయుధాలు కలిగి ఉన్న కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+