ఓలాకు షాక్: జపాన్ కంపెనీతో ఉబెర్ బిగ్ డీల్.. వాటా కొనుగోలు!
ఉబెర్-జపాన్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ డీల్ ఎట్టకేలకు ఓకె అయింది.
న్యూఢిల్లీ: కార్పోరేట్ గవర్ననెన్స్, న్యాయపరమైన చిక్కుల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఉబెర్-జపాన్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ డీల్ ఎట్టకేలకు ఓకె అయింది. ఉబెర్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సాఫ్ట్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ మేరకు దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువ చేసే ఉబెర్ వాటాను సాఫ్ట్ బ్యాంకు కొనుగోలు చేయడానికి సిద్దమైంది. తర్వాతి కాలంలో దాదాపు 14శాతం వాటాను సాఫ్ట్ బ్యాంకు కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది.

కాగా, గత అక్టోబర్ నెలలోనే ఉబెర్-సాఫ్ట్ బ్యాంకు డీల్ ఫైనల్ కావాల్సి ఉంది. కానీ కార్పోరేట్ గవర్నెన్స్, న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇంతకాలంగా అది వాయిదా పడుతూ వచ్చింది. సోప్ట్ బ్యాంక్ డ్రాగోనియర్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ నేతృత్వంలోని కన్సార్షియంతో ఒక ఒప్పందం కుదిరిందని ఉబెర్ ధ్రువీకరించింది.
విదేశాల్లో తమ సేవలను విస్తరించడానికి ఇది దోహదపడుతుందని ఉబెర్ తెలిపింది. గతంలో సాఫ్ట్ బ్యాంకు సంస్థ ఓలా, ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ లోను పెట్టుబడులు పెట్టింది. అయితే నష్టాలను మాత్రమే మూటగట్టుకుంది. ఓలా ప్రత్యర్థి ఉబెర్ లో సాఫ్ట్ బ్యాంకు పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications