బెంగళూరులో లేడీ టెక్కీతో ఉబర్ క్యాబర్ డ్రైవర్ అసభ్యంగా, దిక్కున్న చోట చెప్పుకో!

బెంగళూరు: ప్రసిద్ది చెందిన క్యాబ్ కంపెనీలలోని కొందరు డ్రైవర్ల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. బెంగళూరు నగరంలో మరోసారి లేడీ టెక్కీతో ఉబర్ క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించి నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరించి వెళ్లిపోయాడు.

బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ లో నివాసం ఉంటున్న యువతి బెళ్లందూరులోని సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. మంగళవారం ఉద్యోగానికి వెళ్లడానికి లేడీ టెక్కీ ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. కేఏ 42-ఏ 4692 నెంబర్ ఇతియోస్ కారు లేడీ టెక్కీ చెప్పిన ప్రాంతానికి వెళ్లింది.

Uber taxi driver misbehave with lady techie in Bangalore

హెచ్ఎస్ఆర్ లేఔట్ నుంచి కారు బెళ్లందూరుకు బయలుదేరింది. మార్గం మధ్యలో కారు డ్రైవర్ రూట్ మార్చాడు. బెళ్లందూరుకు వెళ్లకుండా ఎటువైపు వెలుతున్నావు అంటూ లేడీ టెక్కీ కారు డ్రైవర్ ను ప్రశ్నించారు. నోరుమూసుకుని కుర్చో అంటూ కారు డ్రైవర్ లేడీ టెక్కీని బెదిరించాడు.

ఎక్కువ మాట్లాడితే ఇప్పుడే కారులో నుంచి బయటకు నెట్టేస్తానని కారు డ్రైవర్ పురుషపదజాలంతో లేడీ టెక్కీని బెదిరించాడు. అంతేకాకుండా ఆమెను సాఫ్ట్ వేర్ కంపెనీ దగ్గర కాకుండా మార్గం మధ్యలో కారులో నుంచి కిందకు దింపేసి నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరించి వెళ్లిపోయాడు. బుధవారం సోషల్ మీడియా ద్వారా లేడీ టెక్కీ బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చెయ్యడంతో ఉబర్ క్యాబ్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+