Udaipur: టైలర్ హత్య దెబ్బతో 32 మంది ఐపీఎస్ అధికారుల పైవేటు, లిస్ట్ లో ఐజీ, సీరియస్ !
ఉదయ్ పూర్/రాజస్థాన్: ఇస్లాం మతాన్ని అవమానించారని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ ను అతి కిరాతకంగా హత్య చెయ్యడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కన్హయ్య లాల్ హత్య కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నా రాజస్థాన్ లో పరిస్థితి అదుపులోకి రాలేదు. కన్హయ్య లాల్ హత్య కేసు దెబ్బతో రాజస్థాన్ లో 32 మంది ఐపీఎస్ అధికారుల మీద బదిలీ వేటు పడింది.

ఆరోజు కేసు పెట్టిన కన్హయ్య లాల్
టైలర్ కన్హయ్య లాల్ హత్యతో ఉదయ్ పూర్ రగిలిపోతాఉంది. ఉదయ్ పూర్ లో ఇప్పటికే కర్ఫ్యూ అమలులో ఉంది. నెల రోజుల పాటు రాజస్థాన్ మొత్తం 144 సెక్షన్ విధించారు. బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే కన్హయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనను చంపేస్తామని కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏమాత్రం పట్టించుకోని పోలీసులు
ఆ రోజు కన్హయ్య లాల్ కేసు పెట్టిన వ్యక్తులను అరెస్టు చేసి ఉంటే అతన్ని హత్య చెయ్యడానికి చాన్స్ ఉండేదికాదని, ఉదయ్ పూర్ లో అల్లర్లు జరగడానికి అవకాశం ఉండేదికాదని అధికారుల విచారణలో వెలుగు చూసింది. కన్హయ్య లాల్ కేసులో నిర్లక్షం చేసిన ఏఎస్ఐ మీద ఇప్పటికే రాజస్థాన్ పోలీసు అధికారులు వేటు వేశారు.
Recommended Video


32 మంది ఐపీఎస్ ల మీద బదిలి వేటు
కన్హయ్య లాల్ హత్య కేసును కేంద్ర హోమ్ శాఖ సీరియస్ గా తీసుకోవడంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. పోలీసు అధికారుల నిర్లక్షం కారణంగా కన్హయ్య లాల్ హత్య జరిగిందని ఏన్ఐఏ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసు దెబ్బతో ఉదయ్ పూర్ ఏడీజీపీ, ఎస్పీతో పాటు మొత్తం 32 మంది పోలీసుల అధికారుల మీద బదిలీ వేటుపడింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications