ప్రముఖ తమిళ హీరోకు డీఎంకే పార్టీ యూత్ విభాగం పగ్గాలు, తాత, తండ్రి అడుగుజాడల్లో !
చెన్నై: డీఎంకే పార్టీ యువజన విభాగం (యూత్ వింగ్) ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ తమిళ హీరో, నిర్మాత ఉదయానిధి స్టాలిన్ ను నియమించామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కే. అన్బళగన్ తెలిపారు. తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మనుమడు, ఆ రాష్ట్ర శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన ఎంకే. స్టాలిన్ కుమారుడు అయిన ఉదయానిధి స్టాలిన్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడానికి రంగం సిద్దం అయ్యింది.
ఎంకే. స్టాలిన్ డీఎంకే పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా 30 ఏళ్లు పని చేశారు. డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన ఎంకే. స్టాలిన్ యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. తరువాత మాజీ శాసన సభ్యుడు వెల్లకోవిల్ ఎంపీ స్వామినాథన్ కు డీఎంకే పార్టీ యూత్ విభాగం పగ్గాలు అప్పగించారు.

ఎంకే. స్టాలిన్ నుంచి యూత్ విభాగం భాద్యతలు స్వీకరించిన ఎంపీ. స్వామినాథన్ తనదైన మార్క్ లో ఇంత కాలం పార్టీ కార్యకలాపాలు కొనసాగించారు. అయితే ఇటీవల జరిగిన డీఎంకే పార్టీ నాయకుల సమావేశంలో ఆ పార్టీ యూత్ విభాగం పగ్గాలు ఉదయానిధి స్టాలిన్ కు అప్పగించాలని నిర్ణయించారు.
మూడు సంవత్సరాల క్రితం ఉదయానిధి స్టాలిన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్ట్టారు. తాత ఎం. కరుణానిధి, తండ్రి ఎంకే. స్టాలిన్ ను ఆదర్శంగా తీసుకున్న ఉదయానిధి స్టాలిన్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనేక తమిళ సినిమాల్లో హీరోగా నటించిన ఉదయానిధి స్టాలిన్ మురసోలి ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications