ఫేస్‌బుక్ లైవ్‌లోనే ఉద్దవ్ శివసేన నాయకుడి కాల్చివేత (వీడియో)

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కాల్పులు కలకలం రేపాయి. ఉద్ధవ్ థాక్రే శివసేన నాయకుడు వినోద్ ఘోసల్కర్ కుమారుడు అభివషేక్ ఘోసల్కర్ (Abhishek Ghosalkar)పై దుండుగుడు కాల్పులు జరిపాడు. మౌరిస్ భాయ్ అనే వ్యక్తి అతి సమీపం నుంచి రెండు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో అభిషేక్ ప్రాణాలు కోల్పోయారు.

ఫేస్‌బుక్ లైవ్‌లో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గమనించిన వెంటనే అభిషేక్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తరలించిన కాసేపటికే అభిషేక్ ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. మరోవైపు, నిందితుడు మౌరిస్ భాయ్ కూడా తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Uddhav Sena Leader Abhishek Ghosalkar Shot Dead During Facebook Live

అంతకుముందు, ఉల్హాస్‌నగర్ పోలీస్ స్టేషన్‌లోని ఏక్‌నాథ్ షిండే క్యాంపు నాయకుడిపై కాల్పులు జరిపిన బిజెపి ఎమ్మెల్యే వీడియో బయటపడింది. ఈ ఘటన తర్వాత మహారాష్ట్ర శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే అభిషేక్ ఘోసల్కర్‌పై కాల్పులు జరిపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

అభిషేక్ మాజీ ఎమ్మెల్యే వినోద్ ఘోసల్కర్ కుమారుడు. ఆయన ఉద్ధవ్ ఠాక్రేకు సన్నిహితుడిగా భావిస్తారు. ముంబై బిల్డింగ్ రిపేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. అభిషేక్ కూడా కౌన్సిలర్‌గా ఉన్నారు. అతని భార్య కూడా కౌన్సిలర్‌. కాగా, అభిషేక్‌కి మౌరిస్‌ భాయ్‌తో శత్రుత్వం ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల వారిద్దరూ రాజీ పడ్డారు. అయితే, తాజాగా, అభిషేక్‌ను మౌరిస్ తన కార్యాలయంలో ఒక కార్యక్రమానికి పిలిచి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలో ఏక్‌నాథ్ షిండే శివసేన, బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్, ఉద్దవ్ థాక్రే శివసేన నేతలు విమర్వలు గుప్పిస్తున్నారు. ఏక్‌నాథ్-ఫడ్నవీస్ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రలో ఎవరూ సురక్షితంగా లేరని ఉద్ధవ్ సేన అధికార ప్రతినిధి ఆనంద్ దూబే అన్నారు. ఏ ప్రజాప్రతినిధికి భద్రత లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టిస్తోందా? ప్రభుత్వం కండలవీరులను సిద్ధం చేస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. ఈరోజు మనం చూసినవే దీనికి నిదర్శనం. మా మాజీ కౌన్సిలర్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ప్రభుత్వం రామరాజ్యం గురించి మాట్లాడుతుందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+