మహా సిఎం పదవిపై కన్నేసిన ఉద్ధవ్ థాకరే

ముంబై: శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై కన్నేసినట్లు కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన శనివారం ఓటర్లను కోరారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఆయన బహిరంగ ప్రకటన చేయడం ఇదే తొలిసారి.

ముఖ్యమంత్రిగా తనకు అవకాశం వస్తే ప్రజలు విచారించకుండా చూస్తానని ఆయన అన్నారు. శాసనసభ ఎన్నికల్లో శివసేనతో సీట్ల పంపకంపై బిజెపి ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాషాయ కూటమి అధికారంలోకి వస్తే తామే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని శివసేన భావిస్తున్నట్లు సమాచారం.

తనకు ఓసారి అవకాశం ఇవ్వాలని, ఆ అవకాశం ఇస్తే ఫిర్యాదులు లేకుండా చూస్తానని ఉద్ధవ్ థాకరే అన్నారు ఓ ప్రైవేట్ న్యూస్ చానెల్ ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిని అవుతాననే కలలను తాను కనడం లేదని, అయితే అవకాశం వస్తే బాధ్యతలను స్వీకరిస్తానని ఆయన అన్నారు.

Uddhav Thackeray seeks to become CM, urges people to give him a chance

ఎవరు ముఖ్యమంత్రి కావాలనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారని, తాను పదవి కోసం పాకులాడడం లేదని, అయితే అవకాశం వస్తే బాధ్యత తీసుకుంటానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి శివసేనకు దక్కాలనేది తన అభిప్రాయమని ఆయన అన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే ముఖం శివసేనదేనని ఆయన అన్నారు.

తాను బాలసాహెబ్ పుత్రుడిని అని, బాధ్యతల నుంచి తాను వెనక్కి తగ్గబోనని ఆయన అన్నారు. బిజెపితో సీట్ల పంపకం విషయంపై ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. బిజెపితో చర్చలు జరుగుతున్నాయని, తాము పోటీ చేయని స్థానాలు బిజెపికి వెళ్తాయని ఆయన అన్నారు. దీన్నిబట్టి మహారాష్ట్రలో సీనియర్ భాగస్వామిగా శివసేన వ్యవహరించాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+