యూజీసీ నెట్ 2023 ఫలితాలు విడుదల: ఇలా చెక్ చేసుకోండి

న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(జూన్) (UGC-NET)2023 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.inలో ఫలితాన్ని తనిఖీ చేయవచ్చు. పరీక్ష రాసిన అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతోపాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు.

జూన్ 13 నుంచి జూన్ 22 వరకు ఆన్‌లైన్ విధానంలో యూజీసీ నెట్ పరీక్షను నిర్వహించి విషయం తెలిసిందే. మొత్తం 83 సబ్జెక్టులకు దేశ వ్యాప్తంగా 181 నగరాల్లోని పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. 6,39,069 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాత్కాలిక సమాధానాల కీని జూలై 5న విడుదల చేశారు.

UGC-NET 2023 Result Declared: check score here

దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్(అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను ప్రతి సంవత్సరం రెండుసార్లు జాతీయ పరీక్షల ఏజెన్సీ(NTA) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

UGC-NET 2023 ఫలితాలు ఎలా తనిఖీ చేయాలంటే?

దశ 1: అధికారిక వెబ్‌సైట్‌ - ugcnet.nta.nic.inను సందర్శించండి

దశ 2: హోమ్‌పేజీలో, ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

దశ 3: అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి అవసరమైన అన్ని ఆధారాలను నమోదు చేయండి.

దశ 4: భవిష్యత్తు ఉపయోగం కోసం ఫలితాన్ని సేవ్ చేయండి, డౌన్‌లోడ్ చేయండి, ప్రింట్ అవుట్ తీసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+