ఉజ్జయినీ మహాకాల్ ఆలయ ప్రహారీ గోడ కూలి ఇద్దరు మృతి: పలువురికి గాయాలు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయినీలో విషాద ఘటన చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం ఉజ్జయినీలోని మహాకాల్ ఆలయ సరిహద్దు గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. గోడ శిథిలాల కింద పలువురు చిక్కుకోవడంతో వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.

శుక్రవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ఆ గోడ కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఉజ్జయిని జిల్లా మేజిస్ట్రేట్ నీరజ్ కుమార్ సింగ్ ప్రాణనష్టం, వ్యక్తులకు గాయాలను ధృవీకరించారు. భారీ నీటి ప్రవాహం కారణంగా మహారాజ్‌వాడ పాఠశాల సమీపంలోని సరిహద్దు గోడలో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు, వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Ujjain Mahakal Temple Boundary Wall Collapses Two Killed Many Injured

ఒక పురుషుడు, ఒక మహిళ మరణించగా, ఒక బాలిక, ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గోడ కూలిన ఘటనలో పలువురు ఇంకా శిథిలా చిక్కుకుపోయి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. బాధితుల ఖచ్చితమైన సంఖ్య అనిశ్చితంగా ఉంది.

భారీ వర్షంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ సవాలుగా ఉంది. భారీ వర్షంలోనే శిథిలాల కింద చిక్కుకున్న వారిన బయటికి తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. గాయపడిన వారిలో కొందరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

ఉజ్జయినీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వీధుల్లో వరదనీరు భారీగా చేరుతోంది. రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తితో సహా ఐదుగురిని శిథిలాల నుంచి బయటకు తీశారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉజ్జయినీ మహాకాల్ ఆలయంలో సాయంత్రం హారతికి ముందు ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+