లాక్ డౌన్లో ఏకంగా విమానం తయారీ-ఇప్పుడు గాల్లోకి పయనం-కేరళ యువకుడి అరుదైన ఫీట్..
కరోనా వచ్చి లాక్‌డౌన్ విధించిన సమయంలో చాలా మంది ప్రజలు ఇంట్లోనే కాఫీ తాగుతూ స్ట్రీమింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ గడిపారు. కానీ అదే సమయంలో యూకేకు చెందిన కేరళ యువకుడు అశోక్ థమరాక్షన్ మాత్రం వేరే వ్యాపకాన్ని ఎంచుకున్నాడు. దాంతోనే బిజీగా గడిపాడు. చివరికి అదే ఇప్పుడు అతన్ని హీరోగా మార్చేసింది. యూకేలో ఆటోమొబైల్ ఇంజనీర్ గా పనిచేసిన అతను.. ఏకంగా లాక్ డౌన్ లో విమానాన్ని నిర్మించాడు. నాలుగు సీట్లున్న ఈ విమానంలో ఆయన ఇప్పుడు దేశాలు చుట్టేస్తున్నాడు.
చిన్నప్పటి నుండి విమానాల పట్ల తనకున్న ఆకర్షణతో ఈ ప్రయోగం చేసి విజయం సాధించినట్లు కేరళలోని అలప్పుజాకు చెందిన అశోక్ చెప్తున్నారు. ఆర్ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎవి థమరాషన్ కుమారుడైన అశోక్ 2006లో పాలక్కాడ్‌లోని ఎన్‌ఎస్‌ఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఫోర్డ్‌లో ఉద్యోగిగా యూకే వెళ్లారు.

అక్కడ స్థిరపడిన తర్వాత తాను విమానం కొనాలనే ఆసక్తి పెంచుకున్నారు. పైలట్ లైసెన్స్ తీసుకున విమానాల కోసం వెతకడం ప్రారంభించారు. అప్పుడే అతనికి విమానం దాదాపు రూ. 5 నుంచి 6 కోట్ల వరకు ఖర్చవుతుందని అర్థమైంది. దీంతో తానే ఓ విమానం తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. యూకే, ఇతర దేశాలలో చాలా మంది వ్యక్తులు చిన్న విమానాలను తయారుచేస్తున్నారు. దీనికి కావాల్సినవిడిభాగాలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుసుకున్నారు.

ఇదే క్రమంలో దక్షిణాఫ్రికా నుండి విమానం విడిభాగాలను, ఆస్ట్రియా నుండి ఇంజిన్‌ను, యూఎస్ నుంచి ఏవియానిక్స్ పరికరాలను కొనుగోలు చేసి యూకేలోని ఎసెక్స్‌లోని నా దగ్గర వర్క్‌షాప్ ఏర్పాటు చేసారు. 2020లో కరోనా లాక్ డౌన్ విధించడంతో ఇంట్లోనే ఉండి విమానం నిర్మాణం చేపట్టారు. యూకే ఏవియేషన్ అథారిటీ ఆయన విమానం తయారీని పర్యవేక్షించింది. యూకేలో లాక్‌డౌన్ కారణంగా అతను పనిచేస్తున్న కంపెనీ కార్యకలాపాలను నిలిపివేయడంతో అది కూడా కలిసొచ్చింది. మొదట్లో రెండు సీట్ల విమానాన్ని నిర్మించాలని భావించినా భార్య, ఇద్దరు పిల్లలతో కుటుంబ పర్యటన కోసం నాలుగు-సీట్ల విమానం అవసరమని ఆ తర్వాత ఆలోచన మార్చుకున్నారు.అప్పుడు నాలుగు సీట్ల విమానానికి ఏర్పాట్లు చేశారు.
యూకే సివిల్ ఏవియేషన్ అథారిటీ సాయంతో విమానం నిర్మాణనం ప్రతి దశ, తనిఖీ, ఆమోదం తీసుకుని విమానం తయారు చేసారు. అధికారులు మూడు నెలల పాటు నిరంతరంగా విమానంలో ఫ్లయింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. చివరకు ఫిబ్రవరిలో ప్రయాణించడానికి అంగీకరించారని అశోక్ చెప్పారు. విమానాన్ని నిర్మించడానికి సుమారు రూ. 1.8 కోట్లు ఖర్చు కాగా.. మొత్తం 1,500 గంటలు సమయం పట్టింది. విమానం బరువు 520కిలోలు కాగా.. 950కిలోల మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో నలుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. గంటలో 250 కిలోమీటర్లు ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేశారు.
తన కుమార్తె దియా (G అనేది దేశం కోడ్) పేరు మీదుగా ఆ విమానానికి G-Diya అని అశోక్ పేరు కూడా పెట్టారు. విమానానికి అనుమతి పొందిన తర్వాత, అశోక్, అతని ఇద్దరు స్నేహితులు ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్‌లను సందర్శించారు. ఇప్పటి వరకు విమానం 86 గంటల ప్రయాణం పూర్తి చేసింది. వచ్చే నెలలోపు యూకేకి తిరిగి వచ్చిన తర్వాత మరిన్ని ట్రిప్పులు ప్లాన్ చేస్తున్నట్లు అశోక్ తెలిపారు. ఆయన భార్య అభిలాషా దూబే యూకేలో భీమా డేటా విశ్లేషకురాలు, ఆమె ఇండోర్‌కు చెందినవారు.












Click it and Unblock the Notifications