వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూకే-ఇండియా వీక్ 2018 అవార్డ్స్: ఉత్తమ నామినేషన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బ్రిటిష్ - ఇండియా పార్ట్‌నర్‌షిప్ కోసం ఉత్తమ నామినేషన్స్ విడుదలయ్యాయి. సునీల్ భారతి మిట్టల్, రిటైర్డ్ ప్రీతి పటేల్ ఎంపీ, బారీ గార్డినర్ ఎంపీ, లార్డ్ మర్లాండ్‌ల నేతృత్వంలో అవార్డుల కార్యక్రమం జరగనుంది.

22 మే 2018, లండన్ - 2018 యూకే - ఇండియా అవార్డుల కోసం యూకే వ్యాప్తంగా ఉన్న ప్రముఖ అంతర్జాతీయ అభివృద్ధి పథకాలు, సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్, వరల్డ్ లీడింగ్ బ్రిటిష్ కల్చరల్ ఇనిస్టిట్యూషన్స్, టెక్ మరియు డిజిటల్ సంస్థలు నామినీస్‌గా ఉన్నాయి.

యూకే - ఇండియా వీక్‌లో (18-22 జూన్ 2018) కీలకమైన హైలైట్ ఏమంటే యూకే మరియు భారత్ మధ్య బలమైన ప్రపంచ భాగస్వామ్యం కోసం గణనీయమైన ప్రభావం చూపుతున్న వినూత్న మరియు మార్గదర్శక వ్యక్తులు, సంస్థలు ఒక్కచోటకు వచ్చి, సంబరాలు జరుపుకుంటారు.

వ్యాపార, టెక్నాలజీ, మీడియా, అంతర్జాతీయ వాణిజ్యం, రాజకీయాలకు చెందిన ప్రముఖులతో కూడిన ప్యానెల్ యూకే - ఇండియా అవార్డులకు జడ్జిలుగా వ్యవహరించనున్నారు. వీరితో సహా

- లార్డ్ మర్లాండ్, కామన్వెల్త్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సెల్ చైర్మన్
- సునీల్ భారతి మిట్టల్, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఫౌండర్ అండ్ చైర్మన్
- రిటైర్డ్. హాన్. బారీ గార్డినర్ ఎంపీ, స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షాడో సెక్రటరీ
- రిటైర్డ్. హాన్ ప్రీతీ పటేల్ ఎంపీ, స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ మాజీ సెక్రటరీ
- ఎడ్విన్ డన్, సీఈవో, స్టార్‌కౌంట్
- బర్కాదత్, ఆథర్ మరియు బ్రాడ్‌కాస్టర్

ఇరవై ఐదు సంస్థలు ప్రతిపాదించబడ్డాయి. వాటిలో..
- ది బ్రిటీష్ ఆసియన్ ట్రస్ట్స్ సోషల్ ఇంపాక్ట్ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్ కోసం వొడాఫోన్ ఫౌండేషన్, రీడ్ స్మిత్, మార్క్స్ అండ్ స్పెన్సర్, స్టాండర్డ్ చార్టర్డ్.
- మీడియా, ఆర్ట్స్ మరియు కల్చర్ అవార్డు కోసం ది సైన్స్ మ్యూజియం, బీబీసీ న్యూస్ ఇండియన్ లాంగ్వేజెస్, ది పార్టీషన్ మ్యూజియం అండ్ జేమ్స్ ఎర్స్‌కిన్, 200 నాటౌట్ ఫిలిమ్స్, కార్నీవాల్ సినిమాస్.
- ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్ కోసం లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్, వధావన్ గ్లోబల్ కేపిటల్ అండ్ బార్క్‌లేస్ బ్యాంక్ ఇండియా.
- ఇన్వెస్ట్ ఇండియాస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్ కోసం ది మాంచెస్టర్ ఇండియా పార్ట్‌నర్‌షిప్, టెక్ యూకే, కాన్‌పెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీస్ అండ్ ది మిడ్‌ల్యాండ్ ఇంజన్.
- లా ఫర్మ్ ఆఫ్ ది ఇయర్ కోసం వెడ్‌లేక్ బెల్, లింక్‌లాటర్స్, సైరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్, ట్రై లీగల్.
- కన్సల్టెన్సీ ఫర్మ్ ఆఫ్ ది ఇయర్ కోసం సన్నమ్ ఎస్4, గ్రాంట్ థార్నర్న్ అండ్ కింగ్‌స్టన్ స్మిత్.
- పీఆర్ ఫర్మ్ ఆఫ్ ది ఇయర్ కోసం ఏవియన్ మీడియా, స్టెర్లింగ్ మీడియా, ఓగిల్వీ అండ్ మాథర్.

UK India week 2018: Awards shortlist showcases winning partnership

యూకే - ఇండియా విన్నింగ్ భాగస్వామ్యంలో అద్భుతమైన కృషికి గాను నలుగురు ప్రముఖులు ప్రతిష్టాత్మక 'ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్' కేటగిరీ కింద ఎంపికయ్యారు. ఇందులో అరబిందర్ చాత్వాల్, పార్ట్‌నర్, బీడీవో; సిరిల్ ష్రాఫ్, ఫౌండర్ & మేనేజింగ్ పార్ట్‌నర్, సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్; డేవిడ్ లాండ్‌మాన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, టాటా సన్స్; పాట్ సైనీ, పార్ట్‌నర్ & హెడ్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్, పెన్నింగ్టన్స్ మాంచెస్ ఎల్ఎల్‌పీ.

మనోజ్ లాడ్వా, ది బ్రిటీష్ ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూయర్ అండ్ రాజకీయ వ్యూహకర్త, యూకే - ఇండియా వీక్ వ్యవస్థాపకులు, విన్నింగ్ పార్ట్‌నర్‌షిప్ ఎడిటర్: ఇండియా-యూకే రిలేషన్స్ బియాండ్ బ్రెగ్జిట్., ఏం చెప్పారంటే:

"యూకే-ఇండియాల అవార్డుల కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైంది. ఈ అవార్డుల ప్రధానోత్సవం ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది. రెండు దేశాల ప్రజలు యూకే భారత్ బంధం బలోపేతం అయ్యేందుకు సృజనాత్మకతతో వ్యవహరిస్తున్నారు."

"ప్రపంచం ముందుకెళ్లడంలో యూకే భారత్‌లు పూర్తిస్థాయిలో తమ పాత్ర పోషించాల్సి ఉంది. ప్రపంచం పరివర్తన చెందేందుకు సహకరించిన రెండు దేశాల సంస్థలు లేదా వ్యక్తులను యూకే భారత్ అవార్డుల వేడుకలో సన్మానించడం జరుగుతుంది. రెండు దేశాలు కలిసి పనిచేస్తూ ప్రపంచ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొత్త దారులను అన్వేశిస్తున్నాయి."

గతేడాది జరిగిన అవార్డుల కార్యక్రమంలో ప్రధాని థెరిసా మే వీడియో సందేశాన్ని పంపారు. అందులో ఆమె ఇలా అన్నారు.
"యూకే ఇండియా అవార్డుల కార్యక్రమం ఎంతో ఘనమైనది. ఇలాంటి అవార్డులతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతాయి. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని రావాలి. యూకే ఇండియాల మధ్య సత్సంబంధాలు కొనసాగేందుకు విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు"

జూన్ 22, 2018న లండన్‌లో జరగనున్న అవార్డుల కార్యక్రమంలో విజేతలను ప్రకటించడం జరుగుతుంది. ఎంతో ఘనంగా జరుగనున్న ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ వ్యవహరించనున్నారు. 2017లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య ప్రసంగీకులుగా విదేశీవ్యవహారాల శాఖ కార్యదర్శి బోరిస్ జాన్సన్, భారత కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, భారత హైకమిషనర్ వై.కే. సిన్హాలు పాల్గొన్నారు.

రెండోసారి జరగనున్న యూకే భారత్‌ల సమావేశంలో యూకే ఇండియా వీక్ ప్రారంబోత్సవ సమయంలోనే (18 జూన్-22 జూన్)అవార్డుల వేడుకలు జరుగుతాయి. యూకే-ఇండియా వీక్ వేదిక ఇరు దేశాల మధ్య సంబంధాలకు గట్టి పునాది వేయడంతో పాటు భవిష్యత్తులో ఇరు దేశాలకు మంచి అవకాశాలు కల్పంచడంలో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో 5వ వార్షికోత్సవ యూకే-ఇండియా లీడర్షిప్ కాంక్లేవ్ (జూన్ 20-జూన్ 21) జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా రెండు దేశాల అభివృద్ధి, వ్యూహాత్మక భాగస్వామ్యులుగా ఇరు దేశాలు పరివర్తన చెందడం ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చాక రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుంది.

యూకే-ఇండియా వీక్ గురించి:

యూకే - ఇండియా వీక్ (18-22 జూన్) యూకే మరియు భారత్ మధ్య బలమైన భాగస్వామ్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. భవిష్యత్తు సహకార అవకాశాల కోసం ఇది ఒక ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. ఇది 5వ వార్షిక యూకే-ఇండియా లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ (జూన్20-21), బ్రెగ్జిట్ బ్రిటన్ అండ్ గ్లోబల్ ఇండియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెరగడానికి మరియు మార్చడానికి మార్గాలను గుర్తించేందుకు ఓ ల్యాండ్ మార్క్.

ఇండియా ఇంక్., యూకే-ఇండియా వీక్ ఆధ్వర్యంలోని ఫీచరింగ్ ఈవెంట్స్ మరియు సింపోసియా.. ఇండియా ఇంక్. యొక్క పాపులర్ '100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ ఇన్ యూకే - ఇండియా రిలేషన్స్' పవర్ లిస్ట్ 2వ ఎడిషన్‌తో (18 జూన్) ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హై కమిషనర్స్ కప్ (19 జూన్) - ఆహ్వానం - హైకమిషనర్స్‌తో పాటు బిజినెస్, డిప్లోమసీ ప్రముఖులకు వన్ డే గోల్ఫ్ టోర్నమెంట్ - సెకండ్ యూన్యువల్ యూకే - ఇండియా అవార్డ్స్ (22 జూన్)తో ముగుస్తుంది.

ఇండియా ఇంక్. గురించి:

ఇండియా ఇంక్. లండన్‌కు చెందిన మీడియా హౌస్. ఇది భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాపంచీకరణ ఆర్థిక, వ్యూహాత్మక అజెండాకు సంబంధించిన పెట్టుబడి, వాణిజ్యం మరియు విధాన విషయాలపై అత్యుత్తమ కంటెంట్ మరియు ఈవెంట్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రధాన ప్రచురణ ఇండియా గ్లోబల్ బిజినెస్. ఇది పక్షపత్రిక. దీనికి ప్రపంచవ్యాప్తంగా 100,000 బిజినెస్, పాలసీ లీడర్ల రీడర్‌షిప్ ఉంది.

మరో విషయం ఏమంటే, ఇండియా ఇంక్. ప్రభావం చూపగల అనేక ఈవెంట్స్‌ను నిర్వహిస్తోంది. యాన్యువల్ యూకే-ఇండియా లీడర్‌షిప్ కాన్‌క్లేవ్, యూకే-ఇండియా అవార్డ్స్, ది గో గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్ వంటి వాటిని నిర్వహించింది.

ఇండియా ఇంక్.ను ప్రముఖ వ్యూహకర్త, ఎంటర్‌ప్రెన్యూయర్ మనోజ్ లాడ్వా 2011లో ప్రారంభించారు.

విజిట్ www.indiaincgroup.com

యూకే-ఇండియా అవార్డ్స్ జడ్జింగ్ ప్యానల్ గురించి:

లార్డ్ మర్లాండ్: లార్డ్ మర్లాండ్ కామన్వెల్త్ ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సెల్ అండ్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇన్వెస్టిమెంట్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్. ఇతను ప్రధానమంత్రి ట్రేడ్ ఎన్వాయ్‌గా మరియు బిజినెస్ అంబాసిడర్ నెట్ వర్క్ చైర్మన్‌గా 2014లో రిటైర్ అయ్యారు. 2010 నుంచి 2012 మధ్య ఇతను డిపార్టుమెంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత బిజినెస్, ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ డిపార్టుమెంట్ కోసం పని చేశారు.

ప్రీతి పటేల్: ప్రీతి పటేల్ 2010లో మొదటిసారి విథమ్ నియోజకవర్గం నుంచి పార్లమెంటు మెంబర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2015లోను ఎన్నికయ్యారు. 2014లో ప్రీతి పటేల్ ట్రెజరీకి ఎక్స్‌చెక్కర్ సెక్రటరీగా నియమించబడ్డారు. 2015 సాధారణ ఎన్నికల నుంచి 2016 జూలై వరకు ఆమె డిపార్టుమెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్‌కు ఉపాధి కల్పన మంత్రిగా పని చేశారు. జూలై 2016 నుంచి నవంబర్ 2017 వరకు స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సార్యదర్శిగా ప్రీతి పని చేశారు.

బారీ గార్డినర్: బారీ గార్డినర్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌కు షాడో సెక్రటరీ. తన ఇరవై రెండేళ్ల పార్లమెంటరీ జీవితంలో అతను మూడు ప్రభుత్వ విభాగాలలో మంత్రిగా పని చేశారు: నార్తర్న్ ఐర్లాండ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఎన్విరాన్‌మెంట్. 1999లో బారీ గార్డినర్ లేబర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. దానికి అతను ప్రస్తుతం చైర్. బారీ కొన్నేళ్లుగా ఇండియాకు ట్రేడ్ డెలిగేషన్స్‌కు నేతృత్వం వహించారు.

సునీల్ భారతి మిట్టల్: సునీల్ భారతి మిట్టల్ భారతి ఎంటర్‌ప్రైజెస్‌కు వ్యవస్థాపక చైర్మన్. సునీల్ భారతదేశంలో మొబైల్ విప్లవం యొక్క మార్గదర్శకులు. ఇతను భారతీయ ఇండస్ట్రీ ప్రపంచ వాణిజ్యం, సహకారం మరియు విధానాల నేతృత్వంతో సంబంధం కలిగి ఉంటాడు. ప్రధానమంత్రి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కౌన్సెల్‌కు పని చేశారు. భారత దేశంలోని అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్ సునీల్ మిట్టల్‌ను వరించింది. అతని ప్రత్యేక సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వరించింది.

బర్ఖా దత్: బర్ఖా దత్ రచయిత, టెలివిజన్ జర్నలిస్ట్, బ్రాడ్‌కాస్టర్. 21 ఏళ్లుగా ఎన్డీటీవీకి పని చేస్తోంది. వి ది పీపుల్, ది బక్ స్టాప్స్ వంటి ఆమె షోలకు అవార్డులు వచ్చాయి. బర్కా స్వయంగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. భారత నాలుగో అత్యున్నత పౌరపురస్కారం పద్మశ్రీని అందుకున్నారు.

ఎడ్విన్ డన్: ఎడ్విన్ డన్.. టెస్కో యొక్క క్లబ్‌కార్డ్, మై రోజర్ ప్లస్ తదితర మరెన్నో ఇతర విధేయత కార్యక్రమాల వెనుక ఉన్న మార్గదర్శక సంస్థ డన్‌హంబీ సహవ్యవస్థాపకులు. 2011లో ఆమె వ్యాపారాన్ని టెస్కోకు అమ్మేసింది. అప్పటికే అది ఆ సంస్థ ఉద్యోగులు 1500 మంది, 25 దేశాలలో 350 మిలియన్ల వినియోగదారులకు చేరుకుంది. ఆ తర్వాత ఆమె వినూత్న ఆవిష్కరణల వైపు తిరిగి ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం ఆమె స్టార్‌కౌంట్ సీఈవో. ఇది కొనుగోలు మరియు అభిప్రాయాల విజ్ఞాన శాస్త్రాన్ని మిళితం చేసే ఒక వినియోగదారు అంతర్దృష్టుల సంస్థ. వినియోగదారుల యొక్క వాయిస్ బోర్డ్ రూంకి తీసుకు వస్తుంది.

యూకే -ఇండియా అవార్డులు 2018 కోసం ఫుల్ షార్ట్ లిస్ట్

సన్ గ్లోబల్స్ డీల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు:
- అవెండస్ కాపిటల్
- ఇండియా రినెవెబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ
- లులు గ్రూప్ ఇంటర్నేషనల్/ట్వంటీ 14 హోల్డింగ్స్

సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవర్డ్:
- విప్రో డిజిటల్
- అకార్డ్ హెల్త్‌కేర్
- విప్రో లైటింగ్
- కార్బన్ క్లీన్ సొల్యూషన్స్

బ్రిటిష్ ఏసియన్ ట్రస్ట్స్ సోషల్ ఇంపాక్ట్ ప్రొజెక్ట్ ఆప్ ది ఇయర్
- వొడాఫోన్ ఫౌండేషన్
- రీడ్స్మిత్
- మార్క్స్ & స్పెండర్
- స్టాండర్డ్ చార్టర్డ్

మీడియా, ఆర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్:
- సైన్స్ మ్యూజియం
- బీబీసీ న్యూస్ (ఇండియన్ లాంగ్వేజెస్)
- జేమ్స్ ఎర్స్‌కిన్, 200 నాటౌట్ ఫిలిమ్స్ అండ్ కార్నీవాల్ సినిమాస్
- పార్టీషన్ మ్యూజియం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్:
- లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్
- వాధావన్ గ్లోబల్ కాపిటల్
- బార్క్‌లేస్ బ్యాంక్ ఇండియా

ఇన్వెస్ట్ ఇండియాస్ ట్రేడ్స్ & ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్:
- మాంచెస్ట్ ఇండియా పార్ట్‌నర్‌షిప్
- టెక్‌యూకే
- మిడ్‌లాండ్స్ ఇంజిన్
- కాన్ఫెడరేషన్ ఆప్ బ్రిటిష్ ఇండస్ట్రీ

లా ఫర్మ్ ఆఫ్ ది ఇయర్:
- వెడ్‌లాక్ బెల్
- లింక్‌లాటర్స్
- సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్
- ట్రిలీగల్

కన్సల్టెన్సీ ఫర్మ్ ఆఫ్ ది ఇయర్:
- సన్నమ్ ఎస్4
- గ్రాంట్ థోర్న్‌టన్
- కింగ్స్‌టన్ స్మిత్

పీఆర్ ఫర్మ్ ఆఫ్ ది ఇయర్:
- అవినా మీడియా
- స్టెర్లింగ్ మీడియా
- ఒగిల్వీ & మాథర్

ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్:
- సిరిల్ ష్రాఫ్, ఫౌండర్ & మేనేజింగ్ డైరెక్టర్ పార్ట్‌నర్, సిరిల్ అమర్‌చంద్ మంగల్‌దాస్
- పాట్ సైనీ, పార్ట్‌నర్&హెడ్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్, పెన్నింగ్‌టన్స్ మాంచెస్ ఎల్ఎల్‌పీ
- ఆర్బిందర్ చాత్వాల్, పార్ట్‌నర్, బీడీవో
- డేవిడ్ లాండ్స్‌మాన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, టాటా సన్స్

English summary
A host of leadinginternational development schemes, social impact funds, world-leading British cultural institutions and representative bodies for tech and digital clusters around the UK are among the nominees for the 2018 UK-India Awards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X