నష్టం జరగదు: హరీష్ సందేహానికి ఉమా జవాబు
న్యూఢిల్లీ: నదుల అనుసంధానం మూలంగా ఏ రాష్ట్రానికి నష్టం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారు. ఉమాభారతి మంగళవారం నదుల అనుసంధానంపై రాష్ట్రాల నీటిపారుదల మంత్రులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నదులను అనుసంధానం చేసేందుకు డి.పి.ఆర్ (డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్) తయారు చేసే ముందు సంబంధిత రాష్ట్రాల అభ్యంతరాలు, సలహాలను తీసుకోవాలని, వీటి ఆధారంగానే డి.పి.ఆర్‌లు తయారు చేయాలని ఈ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అనుసంధానం మూలంగా తెలంగాణ గోదావరి జలాలను కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

ఉమాభారతి స్పందిస్తూ అనుసంధానం మూలంగా ఏ రాష్ట్ర ప్రయోజనమూ దెబ్బతినకుండా చూస్తామని, జల ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ నదుల అనుసంధానాన్ని సమర్థించారు. అయితే హిమాలయ ద్వీపకల్ప నదులను కృత్రిమంగా విడదీయటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. హిమాలయ ప్రాంతంలోని జీవ నదులను ద్వీపకల్పంలోని నిర్జీవ నదులతో అనుసంధానం చేసినప్పుడే దక్షిణాదిలోని రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని దేవినేని ఉమ సూచించారు. నదుల అనుసంధానానికి విడివిడి ప్రణాళికలకు బదులు అన్నింటితో కూడిన సమగ్ర ప్రణాళికను తయారు చేసుకోవటం మంచిదని ఆయన ప్రతిపాదించారు.

నదుల అనుసంధానానికి విడివిడి ప్రణాళికలు తయారు చేస్తే జల లభ్యతలో అలజడి నెలకొనడంతోపాటు ఏ రాష్ట్రం కూడా దీనికి అంగీకరించదని ఉమ స్పష్టం చేశారు. నదుల అనుసంధానంలో జల ప్రవాహం వీలున్నంత వరకు గురుత్వాకర్షణ శక్తిద్వారా ఉండేలా చూడాలన్నారు. వివిధ నీటి పారుదల ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడటంతోపాటు వీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
అనుసంధానానికి ఏర్పాటు చేసే సంఘాలు, ఉపసంఘాలు అందరూ అంగీకరించే నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు. నదుల అనుసంధానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు, దేశ వ్యాపిత ప్రణాళికపై ఏకాభిప్రాయం కుదిరిన తరువాతనే డి.పి.ఆర్ తయారు చేయటం సాధ్యం అవుతుందని ఉమ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరిస్తేనే ఈ ప్రాంతానికి సంబంధించిన అనుసంధానంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications