Asad Encounter: అసద్ ఎన్‍కౌంటర్ ఉమేశ్ పాల్‍కు ఘనమైన నివాళి..!
యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సీఎం అయినా తర్వాత మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. రౌడీలకు చుక్కలు చూపిస్తున్నారు. అతిగా చేస్తే ఎన్ కౌంటర్ చేసిపారేస్తున్నారు. తాజాగా లోక్‌సభ మాజీ ఎంపీ, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్ కొడుకు అసద్‌ను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఉమేశ్ పాల్ హత్య కేసులో అసద్ నిందితుడిగా ఉన్నాడు. అసద్ ను పోలీసులు ఝాన్సీ వద్ద ఎన్కౌంటర్ చేశారు. గురువారం అతిఖ్‌ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
అసద్ ఎన్ కౌంటర్ పై ఉమేశ్ పాల్ తల్లి ఆనందం వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అసద్ మరణం నా కొడుకు మరణానికి ఇచ్చిన నిజమైన నివాళి అని అన్నారు. సీఎం యోగిపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. 2005లో జరిగిన బీఎస్‌పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ అనే లాయర్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉమేశ్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని ఆయన ఇంటి వద్ద చంపేశారు.














Click it and Unblock the Notifications