మూడుకు బదులు అయిదు: బెంగళూరులో కుప్పకూలిన భవనం (ఫొటోలు)
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మరికొందరు శిథిలాల్లో చిక్కుకున్నారు. మూడు అంతస్తులే నిర్మించాల్సి ఉన్నప్పటికీ, అయిదు అంతస్తులు నిర్మించారు.

నిబంధనల ఉల్లంఘన వల్లే ఇది జరిగిందని అంటున్నారు. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ)కి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్లందూర్ (సౌత్ ఈస్ట్ బెంగళూరు)లో ఇది చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఫైర్, ఎమెరెజన్సీ డిపార్టుమెంట్ అధికారులు చెప్పారు. వంద మందికి పైగా ఫైర్ మెన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం కాబట్టి ఎక్కువ నష్టం జరగలేదని అంటున్నారు.

స్థానికంగా నివాసం ఉంటే రామకృష్ణ అనే వ్యక్తి మాట్లాడుతూ.. నిర్మాణం జరుగుతున్న రెండో అంతస్తులో కూలీలు నివాసం ఉంటున్నారని తెలిపారు. నిర్మాణం చివర్లో ఉందన్నారు. చెప్పిన దాని కంటే ఎక్కువ అంతస్తులు, నాణ్యత లేకపోవడం వల్లే ఇది జరిగిందంటున్నారు.













Click it and Unblock the Notifications