మాఫియా డాన్ కు జైల్లో కేఎఫ్ సీ చికెన్ (ఫోటోలు)
ముంబై: ఇంతకాలం కాకమ్మ కథలు చెప్పి జైళ్ల శాఖ అధికారుల మీద ఆరోపణలు చేస్తూ వచ్చిన మాఫియా డాన్ అబూ సలేం అసలు రంగు వెలుగు చూసింది. అతనికి జైల్లో సేవలు చెయ్యడానికి ఓ పనిమనిషి ఉన్నాడని అధికారులు అంటున్నారు.
అబూ సలేంకు సొంత పనిమనిషితో పాటు ఖైదీలు నిత్యం సేవలు చేస్తూ ఉంటారని జైళ్ల శాఖ అధికారి పై అధికారులకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ముంబైలోని తలోజా జైలు సూపరింటెండెంట్ హరిలాల్ జాదవ్ ఈ విషయాలను స్వయంగా వెల్లడించారు.
తలోజా జైలు సూపరింటెండెంట్ హరిలాల్ జాదవ్ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, నిత్యం వేదిస్తున్నారని ఆరోపిస్తూ అబూ సలేం టాడా కోర్టులో 16 పేజీల అఫిడివిట్ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుతో జైళ్ల శాఖ ఐజీపీ బిపిన్ కుమార్ సింగ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రత్యేక విచారణ కమిటి
ప్రత్యేక విచారణ కమిటిని ఏర్పాటు చేశారు. అయితే అబూ సలేం చేసిన ఆరోపణలను ఖండిస్తూ బిపిన్ కుమార్ సింగ్ విచారణ కమిటికి ఐదు పేజీల సమాధానం ఇచ్చారు. అందులో దిగ్భ్రాంతికరమైన ఎన్నో వాస్తవాలు వెలుగు చూశాయి.

క్రిమినల్ కేసులు
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులతో పాటు అనేక క్రిమినల్ కేసులలో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న అబూ సలేం జైల్లో సాగిస్తున్న అరాచకాల చిట్టాను అందులో వివరించారు. అబూ సలేం తనకు సేవలు చెయ్యడానికి సొంత పనిమనిషిని పెట్టుకున్నాడని వివరించారు.

ఖైదీలతో సేవలు
రాజా ఉత్తలింగం నాడార్ అనే ఖైదీ (ఖైదీ నెంబర్- 339) ప్రతి రోజు అబూ సలేం దుస్తులు ఉతకడం, టీ చెయ్యడం, అన్నం వడ్డించడం, గిన్నెలు కడగడం, అతని సెల్ శుభ్రం చెయ్యడం లాంటి పనులు చేస్తున్నాడని చెప్పారు.

కేఎఫ్ సీ చికెన్
తాను అబూ సలేం కు ఈ పనులు చేస్తున్నానని రాజా ఉత్తలింగం నాడార్ అంగీకరించాడు. అబూ సలేం సాటి ఖైదీలకు పార్టీలు ఇస్తుంటాడని అన్నారు. అందు కోసం ఒక్కోసారి ఇంటి నుంచి ఆహారం తెప్పిస్తాడని, గుట్టు చప్పుడు కాకుండా కేఎఫ్ సీ నుంచి చికెన్ కూడా తెప్పిస్తాడని వివరించారు.

జైల్లో హత్యాయత్నం
మొదట అబూ సలేం ఆర్థర్ రోడ్డు జైల్లో ఉండేవాడు. అక్కడ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ముస్తఫా దోసా అనే ఖైదీ అబూ సలేం మీద దాడి చేసి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు. తరువాత 2010 జులై నెలలో అబూ సలేం ను తలోజా జైలుకు తరలించారు.

పోలీసుల నిఘా
అబూ సలేంకు 25 మంది పోలీసులతో భద్రత కల్పించాలని టాడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సిబ్బంది కొరత కారణంగా అబూ సలేం ఉంటున్న గది దగ్గర ఇద్దరు పోలీసులను నియమించారు.

సీసీ కెమెరాలు
సెల్ దగ్గర ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే సీసీ కెమెరాలు తన భద్రత కోసం కాదని, తన మీద నిఘా కోసం పెట్టారని అబూ సలేం ఆరోపిస్తున్నాడు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications