విషమించిన ఛోటా రాజన్ ఆరోగ్యం.. అత్యవసర చికిత్సకు ఏర్పాట్లు!
మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో పాటు హైపర్ టెన్షన్, లాపరోటమీ, ఇన్సిషనల్ హెర్నియా వంటి సమస్యలు ఛోటా రాజన్ ను వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ముంబై: మాఫియా డాన్ ఛోటా రాజన్ ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఛోటా రాజన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడన్న విషయం తాజాగా వెలుగుచూసింది. ఢిల్లీలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఛోటా రాజన్ కి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
కార్డియాలజీ, యూరాలజీ సమస్యలతో బాధపడుతున్న ఛోటా రాజన్ కు తక్షణం చికిత్స అందించాల్సిందిగా ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్ డాక్టర్లు సూచించినట్టుగా తెలుస్తోంది. రాజన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాకే.. అతని పరిస్థితి విషమంగా ఉందని నిర్దారించినట్టుగా చెబుతున్నారు.

మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో పాటు హైపర్ టెన్షన్, లాపరోటమీ, ఇన్సిషనల్ హెర్నియా వంటి సమస్యలు ఛోటా రాజన్ ను వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీటికి తోడు అప్పుడప్పుడు కడుపు నొప్పితో పాటు, ముక్కులో నుంచి రక్తం కారడం, రాత్రుళ్లు నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు రాజన్ ను వేధిస్తున్నాయట.
కాగా, ఛోటా రాజన్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన న్యాయస్థానం.. అతనికి సరైన చికిత్స అందజేయాల్సిందిగా గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications