ఛోటా రాజన్ సోదరుడికి చెక్, ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేం, బీజేపీ, శివసేన దెబ్బకు !
ముంబై/పూణే: మాఫియా డాన్ ఛోటా రాజన్ సోదరుడు దీపక్ నిక్లాజేకి తాము శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ ఇవ్వలేమని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్ పీఐ అఠావళే) తేల్చి చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఒక్క రోజు తరువాత ఆర్ పీఐ ఛోటా రాజన్ సోదరుడు దీపక్ నిక్లాజేకి టిక్కెట్ ఇవ్వలేమని చేతులు ఎత్తేసింది.
మహారాష్ట్రలోని సతారా జిల్లా ఫైల్వాన్ నియోజక వర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఛోటా రాజన్ సోదరుడు దీపక్ కు ఆర్ పీఐ టిక్కెట్ ఇచ్చింది. గురువారం ఆర్ పీఐ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ నాయకులు విడుదల చేశారు.

ఫైల్వాన్ నియోజక వర్గం నుంచి దీపక్ కు టిక్కెట్ ఇచ్చామని ఆర్ పీఐ పార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి అవినాష్ మహటేకర్ గురువారం మీడియాకు చెప్పారు. బీజేపీకి ఆర్ పీఐ మిత్రపక్ష పార్టీ. ఫైల్వాన్ నియోజక వర్గంలో ఛోటా రాజన్ సోదరుడు దీపక్ పోటీ చెయ్యడాన్ని స్థానిక నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకించారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ, శివసేన, ఆర్ పీఐ పార్టీల మధ్య సీట్ల పంపిణి జరిగింది. ఆర్ పీఐ పార్టీ అభ్యర్థులు పోటీ చెయ్యడానికి ఆరు నియోజక వర్గాలు కేటాయించారు. ఆరు నియోజక వర్గాల్లో ఫైల్వాన్ నియోజక వర్గం ఒకటి.
ఛోటా రాజన్ సోదరుడు దీపక్ ఫైల్వాన్ నియోజక వర్గం వ్యక్తి కాదు. స్థానికంగా నివాసం ఉంటున్న దిగంబర్ అగావానేకి సీటు ఇవ్వాలని స్థానికులు ఆందోళన చేశారు. ఛోటా రాజన్ సోదరుడు దీపక్ ను తప్పించి ఆ స్థానంలో దిగంబర్ అగావనేను పోటీ చేయించాలని ఆర్ పీఐ పార్టీ నిర్ణయించదని, కేంద్ర మంత్రి, ఆ పార్టీ వ్యవస్థాపకుడు రామదాస్ అరావళే శుక్రవారం తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications