వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతయ్య సంతకం సూపరయ్య.. యునెస్కో కూడా ప్రశంసలు..

|
Google Oneindia TeluguNews

సంతకం.. తప్పనిసరి. ఇదీ కొందరికీ గుర్తింపును ఇస్తోంది. రకరకాలుగా సిగ్నేచర్ చేస్తుంటారు. ప్రముఖల సైన్ డిఫరెంట్‌గా ఉంటుంది. మరికొందరు కాపీ కొట్టకుండా చేసేస్తారు. సైన్.. గురించి చాలా మంది డిస్కషన్ చేస్తుంటారు. అయితే కర్ణాటకలో ఓ అధికారి మాత్రం మాములగా ఉండదు. అదే సిగ్నేచర్.. దానిని ఏకంగా యునెస్కో ప్రశంసలు కురిపించింది.

పూర్తి పేరును సంక్షిప్తంగా సంతకంలో పొందుపరుస్తారు. ఒక్కొక్కరి సంతకం ఒక్కోలా ఉంటుంది. కర్ణాటకలో గల హోనావర్ ప్రాంతానికి చెందిన శాంతయ్య అనే అధికారి సంతకం మాత్రం విలక్షణం. శాంతయ్య సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. శాంతయ్య పూర్తి పేరు కొంపల్ సోమపుర శాంతయ్య. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నది. అందుకే, తన సంతకం విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. మరెవరూ తన సంతకం ఫోర్జరీ చేసేందుకు వీలు లేకుండా, ఎంతో కష్టపడి, సంక్లిష్టమైన రీతిలో సంతకం చేయడం అలవర్చుకున్నారు.

unesco appreciates karnataka official signature

శాంతయ్య సంతకం కర్ణాటకకే కాదు ఐక్యరాజ్యసమితి సంస్థ యునెస్కో వరకు పాకింది. ఇంతకంటే అద్భుతమైన సంతకం ప్రపంచంలో మరెక్కడా ఉండదు. ఎవరు చేయలేరంటూ యునెస్కో శాంతయ్యను ప్రశంసించింది. గతంలో ఓ హైకోర్టు జడ్జి కూడా శాంతయ్య సంతకం చూసి ఆశ్చర్యపోయారట. ప్రత్యేకంగా శాంతయ్యను ఇంటికి పిలిపించుకుని అభినందించి పంపారట. ఇప్పుడు శాంతయ్య సంతకంతోపాటు, మరికొన్ని విచిత్రమైన సంతకాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంతకం అంటే.. కొందర ఫోర్జరీ చేస్తారు. ఈజీగా ఉంటే చాలు.. తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అందుకోసమే శాంతయ్య కఠినంగా చేశారు. ఆ సంతకం.. కేటుగాళ్లకు కూడా రాదేమో మరీ. దానిని చూస్తే అలానే కనిపిస్తూ ఉంటుంది. సంతకం అంటే మరీ ఇంత కష్టమా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. చాలా మంది మాత్రం ప్రశంసిస్తున్నారు.

English summary
unesco appreciates karnataka official signature. sign is very special to seeing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X