సాక్షి చెప్పిందే జరిగింది... ఆమే భర్తని కోర్టు ముందే కొట్టారు...!

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిథారి చెస్‌పూర్ నియోజక వర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా భయపడినట్టే అంతా జరుగుతోంది. రక్షణ కల్పించాలని అలహాబాద్‌‌ కోర్టును కోరిన సాక్షి దంపతులకు కోర్టు అవరణలో బెదిరింపులకు గురయ్యారు. రక్షణ కోసం కోర్టు మెట్లెక్కిన సాక్షి భర్త అజితేశ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు ముందే దాడి చేశారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిథారి చేస్‌పూర్ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా అజితేశ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. ప్రియున్ని పెళ్లి చేసుకుంది. అయితే తాము పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఎమ్మెల్యే అయిన తన తండ్రితో పాటు ఆయన అనుచరులు వేధిస్తున్నాడని సాక్షి ఆరోపిస్తూ, తమను ప్రాణాలతో బతకనిచ్చేలా లేరని ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 unidentified men beaten up Sakshi Mishra’s husband Ajitesh outside the Allahabad High Court

ఈ నేపథ్యంలోనే తమకు రక్షణ కల్పించాలని అహ్మాదాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే కోర్టుకు వెళ్లే క్రమంలో సాక్షి భర్త అజితేశ్ పై దాడి జరిగిందని సాక్షి తరుఫున అడ్వకేట్ కోర్టుకు వివరించారు. దీంతో సాక్షి దంపతులకు రక్షణ కల్పించాలని స్థానిక పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే సాక్షి వివాహానికి సంబంధించి తనకు ఎలాంటీ అభ్యంతరం లేదని ఎమ్మెల్యే రాజెశ్ మిశ్ర సైతం ప్రకటించాడు.

 unidentified men beaten up Sakshi Mishra’s husband Ajitesh outside the Allahabad High Court
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+