Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్ర బడ్జెట్ 2018: జైట్లీ.. రెండు భాషల్లో అనర్గళంగా.., బడ్జెట్ బ్రీఫ్‌కేస్ వెనక కథేమిటంటే...

న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఇప్పటి వరకు బడ్జెట్ ప్రసంగం ఇంగ్లీషులోనే సాగింది. అయితే జైట్లీ ఈసారి మాత్రం గతానికి భిన్నంగా హిందీ, ఇంగ్లీష్... రెండు భాషల్లో బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.

Recommended Video

    Union Budget 2018-19 : All eyes glued on screens while FM Jaitley presented

    నిజానికి ఈసారి ఆయన బడ్జెట్ ప్రసంగం హిందీలో సాగుతుందని తొలుత వార్తలు వచ్చాయి. గ్రామీణ ప్రజలు, రైతులకు అర్థమయ్యే రీతిలో ఆర్థిక మంత్రి హిందీలో మాట్లాడతారని కొన్ని వర్గాలు వెల్లడించాయి.

    రెండు భాషల్లో అనర్గళంగా...

    రెండు భాషల్లో అనర్గళంగా...

    ఆర్థిక మంత్రిగా జైట్లీ ప్రవేశపెడుతున్న ఐదో బడ్జెట్‌ ఇది. అంతేకాదు, జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌ కూడా. అలాగే వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే అరుణ్ జైట్లీ మాత్రం అటు పూర్తిగా ఆంగ్లంలో కాకుండా.. ఇటు పూర్తిగా హిందీలో కాకుండా రెండు భాషల్లో అనర్గళంగా ప్రసంగించారు. సంప్రదాయానికి భిన్నంగా బడ్జెట్‌ను రెండు భాషల్లో ప్రవేశపెట్టడం కూడా ఇదే తొలిసారి.

    బడ్జెట్ బ్రీఫ్‌ కేసు వెనక...

    బడ్జెట్ బ్రీఫ్‌ కేసు వెనక...

    కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు ఆర్థిక మంత్రి పార్లమెంట్ భవనాన్ని చేరుకుని తన చేతిలోని బడ్జెట్ బ్రీఫ్‌కేస్ ను చూపుతూ ఫొటోలకు పోజివ్వడం యేటా కనిపించే దృశ్యమే. బడ్జెట్ పత్రాలు ఉన్న బ్రీఫ్‌కేస్ చేతబట్టి ఆర్థికమంత్రులు పెదాలపై చిరునవ్వులు పూయిస్తూ పోజు ఇస్తుంటారు. దీనివెనక కూడా ఓ ఆసక్తిదాయకమైన కథ ఉంది. ఈ వ్యవహారం కూడా బ్రిటీష్ పరంపర నుంచి వచ్చినదే.

    సంప్రదాయంగా మారిన పొరపాటు...

    సంప్రదాయంగా మారిన పొరపాటు...

    బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందర బడ్జెట్ పత్రాలున్న బ్రీఫ్ కేస్ చేతబట్టుకుని ఆర్థికమంత్రి ఫొటోగ్రాఫర్లకు పోజు ఇవ్వడం దాదాపు 150 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయం. భారతదేశానికి సంబంధించిన తొలి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది కూడా బ్రిటీష్ హయాంలోనే. ఈ తొలి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జార్జి వార్డ్ హంట్ అనే బ్రిటీష్ ఆర్థికమంత్రి చేసిన ఒక పొరపాటుతో ఇలా బ్రీఫ్‌కేస్‌తో పోజులు ఇచ్చే సంప్రదాయం మొదలైంది.

    అందుకే ఆ బ్రీఫ్‌కేసుతో పోజులు...

    అందుకే ఆ బ్రీఫ్‌కేసుతో పోజులు...

    1869లో జరిగిన సంఘటన ఇది. ఆ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి జార్జి వార్డ్ హంట్ బడ్జెట్ ప్రతులను ఇంటి వద్దే మరిచిపోయి సభకు వెళ్లిపోయాడు. తీరా సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సభాపతి అనుమతి ఇచ్చాక చూసుకుంటే బడ్జెట్ పేపర్లు లేవు. అప్పడుగాని గుర్తుకురాలేదు జార్జి వార్డ్ హంట్‌కు తాను బడ్జెట్ ప్రతులను ఇంటి వద్దే వదిలేసి వచ్చానని. దీంతో ఆ తరువాతి ఏడాది నుంచి ఆర్థిక మంత్రులు ఎవరొచ్చినా సరే.. బడ్జెట్ పత్రాలున్న బ్రీఫ్‌కేస్‌ను తాము మర్చిపోలేదని చెప్పేందుకు గుర్తుగా మీడియా ముందు ఆ బ్రీఫ్‌కేస్‌ను ప్రదర్శించే వారు. ఆ తరువాత స్వతంత్ర భారత దేశంలోనూ ఇన్నాళ్లుగా ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+