Union Budget 2021:బడ్జెట్‌కు సంబంధించి వేగవంతమైన అప్‌డేట్స్‌కు డైలీ హంట్ చూడండి..!
ప్రతి ఏటా ఇటు దేశానికి అటు ప్రభుత్వానికి కీలకంగా వ్యవహరించేది కేంద్ర బడ్జెట్. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్ణయించేది బడ్జెట్. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం రానేవచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రతిసారీ ప్రవేశ బడ్జెట్ ఒక ఎత్తయితే కరోనా కష్టకాలంలో ప్రవేశ పెట్టే ఈ బడ్జెట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ బడ్జెట్ ఎంతో ప్రాముఖ్యమైనదని ఈ దశాబ్దంలో ప్రవేశ పెట్టే తొలిబడ్జెట్ అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
గతేడాది కరోనామహమ్మారి తాండవించిన నేపథ్యంలో కనీసం 4 నుంచి 5 వరకు మినీ బడ్జెట్‌ను కేంద్ర ప్రవేశపెట్టిందని గుర్తు చేసిన ప్రధాని మోడీ... 2021 కేంద్ర బడ్జెట్ వాటన్నిటి మేళవింపుతో ఉంటుందని చెప్పారు. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ సారి బడ్జెట్ పలు సవాళ్లతో కూడుకున్నదై ఉంటుందని సర్వత్రా వినిపిస్తోంది.ఈ సారి బడ్జెట్ ప్రసంగం మొత్తం ఒకే అంశం చుట్టు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాయిలాలు, నష్టపరిహార చర్యలు, భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు ప్రకటనలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే రైతుల ఆందోళనలు, విపక్షాలు సభను బాయ్‌కాట్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఇక బడ్జెట్‌కు సంబంధించి ఏటా డైలీ హంట్‌లో క్షణం క్షణం అప్‌డేట్స్ ఇస్తున్నాము.బడ్జెట్‌తో పాటు సభలో జరిగే అన్ని అంశాలను ప్రత్యక్షంగా మీకు అందిస్తున్నాం. బడ్జెట్ హైలైట్స్‌తో పాటు నిపుణుల విశ్లేషణలు కూడా అందిస్తున్నాం. కాబట్టి డైలీ హంట్‌పై బడ్జెట్ విశేషాలను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి.












Click it and Unblock the Notifications