Union Budget 2021: రూపాయి రాక, పోక ఇలా -పావు శాతం వడ్డీ చెల్లింపులకే సరి..
మొత్తం రూ. 34.83 లక్షల కోట్ల విలువైన కేంద్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 17 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు భర్తీకి రూ. 17,340 కోట్లు కేటాయిస్తూ, ద్రవ్యలోటు అంచనాను 9.5 శాతంగా పేర్కొన్నారు. 2021-2022లో ద్రవ్యలోటును 6.8 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మల చెప్పారు.
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తాలూకు వివరాలను, లోతుపాతులను, కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి రాబడులను, వసూళ్లను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. వాటిని రూపాయితో పోల్చుతూ రూపాయి వసూళ్లు, రూపాయి ఖర్చులుగా ఈ కింది విధంగా ఉన్నాయి..

రూపాయి రాక (వసూళ్లు)
కార్పొరేట్ పన్ను: 13 పైసలు
ఆదాయపు పన్ను: 14 పైసలు
కస్టమ్స్: 8 పైసలు
జీఎస్టీ వసూళ్లు: 15 పైసలు
రెవెన్యూయేతర ఆదాయం: 6 పైసలు
మూలధన వసూళ్లు: 5 పైసలు
పన్నులు, ఇతర ఆదాయం: 36 పైసలు
రూపాయి పోక (ఖర్చులు)
కేంద్ర పథకాలు: 13 పైసలు
వడ్డీ చెల్లింపులు: 20 పైసలు
రక్షణ: 8 పైసలు
సబ్సిడీలు: 9 పైసలు
ఫైనాన్స్ కమిషన్ & ఇతర చెల్లింపులు: 10 పైసలు
రాష్ట్రాల వాటా: 16 పైసలు
పెన్షన్లు: 5 పైసలు
ఇతర ఖర్చులు: 10 పైసలు
అమలులో పథకాలు: 9 పైసలు












Click it and Unblock the Notifications