వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమీపిస్తోన్న కేంద్ర బడ్జెట్..నిర్మలమ్మపైనే ఫోకస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సమీపిస్తోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించడం ఇది 10వ సారి. ఇవి కీలకమైన సమావేశాలు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుండటం, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్‌లో మోడీ సర్కార్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆమెకు ఇది నాలుగో బడ్జెట్. నిర్మలమ్మ ఇప్పటిదాకా మూడుసార్లు బడ్జెట్‌ను ప్రతిపాదనలను సమర్పించారు. 2020, 2021 తరహాలోనే ఈ దఫా కూడా బడ్జెట్ సమావేశాలు కోవిడ్ ఆంక్షల మధ్య కొనసాగనున్నాయి. వరుసగా రెండు కరోనా సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించిన విషయం తెలిసిందే.

Union Budget 2022-23: Nirmala Sitharaman will present the 10th proposal of PM Modis govt on February 1

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీన ఆరంభం కానున్నాయి. ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రెండు విడతల్లో పార్లమెంట్ ఉభయ సభలు భేటీ అవుతాయి. తొలిదశ సమావేశాలు 31వ తేదీన మొదలవుతాయి. ఫిబ్రవరి 11వ తేదీన ముగుస్తాయి. మళ్లీ మార్చి 14వ తేదీన లోక్‌సభ, రాజ్యసభ మలి విడతలో భేటీ అవుతాయి. రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహిస్తాయని సమాచారం. పూర్తి కోవిడ్ ప్రొటోకాల్స్ మధ్య పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది మోడీ సర్కార్.

సమావేశాల తొలి రోజు- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే- బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించడానికి ఒక్కరోజు ముందే కేంద్ర ప్రభుత్వం సోషియో ఎకనమిక్ సర్వే నివేదికను టేబుల్ చేస్తుంది. స్థూల జాతీయోత్పత్తి 9.5గా ఉండొచ్చని రిజర్వుబ్యాంక్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నమోదైన గణాంకాలు మాత్రం దీనికి భిన్నంగా ఉంటోన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం కావడంతో అంచనాలకు అనుగుణంగా జీడీపీ నమోదవుతుందని ఆర్థికశాఖ భావిస్తోంది.

గత సంవత్సరం నిర్మల సీతారామన్..పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సంప్రదాయానికి భిన్నంగా బహీ ఖాతాను సమర్పించారామె. దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ పేరుతో రూపొందించిన ఈ యాప్‌లో బడ్జెట్ ప్రతిపాదనలన్నింటినీ ఉంచారు. ఈ సారి కూడా అదే తరహాలో పేపర్‌లెస్ బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.

English summary
Finance Minister Nirmala Sitharaman will present the Union Budget 2022-23 on February 1. It will be the 10th budget presentation of NDA's government and the 4th by the NirmalaSitharaman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X