కేంద్ర బడ్జెట్ ప్రింటింగ్ షురూ: టీంకు హల్వా అందించిన నిర్మలా సీతారామన్
కేంద్ర బ్డజెట్‌కు ప్రతి యేటా నిర్వహించే హల్వా వేడుకను ఆర్థిక కార్యాలయంలో గురువారం నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన వారందరికీ హల్వా స్వయంగా అందించారు.
న్యూఢిల్లీ: కేంద్ర బ్డజెట్‌కు ప్రతి యేటా నిర్వహించే హల్వా వేడుకను ఆర్థిక కార్యాలయంలో గురువారం నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన వారందరికీ హల్వా స్వయంగా అందించారు.
బడ్జెట్ తయారీ చివరి దశలో హల్వా వేడుక నిర్వహించడం స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి సంప్రదాయంగా వస్తోంది. అయితే, కరోనా కారణంగా గత బడ్జెట్ సందర్భంగా హల్వా కార్యక్రమం నిర్వహించలేదు. మళ్లీ ఈ సంవత్సరం మాత్రం హల్వా వేడుక జరిగింది.

ఫైనాన్స్ మినిస్ట్రీ కార్యాలయ ఆవరణలో జరిగిన హల్వా వేడుకలో ఆర్థిక మంత్రితో పాటు ఆ శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావ్, ఫైనాన్స్ మినిస్ట్రీకి చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
బడ్జెట్ 2023కి సంబంధించిన పత్రాల సంకలనం ప్రారంభానికి గుర్తుగా గురువారం నార్త్ బ్లాక్‌లో సాంప్రదాయ 'హల్వా వేడుక' జరిగింది.
ఈ వేడుకకు హాజరైన ఆర్థిక మంత్రి నిరమలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ గోప్యతను కాపాడేందుకు, బడ్జెట్‌ను రూపొందించడంలో అధికారుల "లాక్-ఇన్" ఉంది. ఈ అధికారులు, సిబ్బంది పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత మాత్రమే నార్త్ బ్లాక్ నుంచి బయటకు వస్తారు.
ఆర్థిక శాఖ సహాయ మంత్రులు భగవత్ కిషన్‌రావ్ కరద్, పంకజ్ చౌదరి, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, దీపం కార్యదర్శి తుహిన్ కాంత పాండే, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత వీ నాగేశ్వరన్, సీబీఐసీ చైర్మన్ వివేక్ జోహ్రీ, బడ్జెట్ తయారీ. సంకలన ప్రక్రియలో పాల్గొన్న ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఇతర అధికారులు, సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అధికారిక ప్రకటన తెలిపింది.
గత రెండు బడ్జెట్‌ల మాదిరిగానే, కేంద్ర బడ్జెట్ 2023-24 కూడా పేపర్‌లెస్ రూపంలో పంపిణీ చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఫిబ్రవరి 1, 2023న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత బడ్జెట్ పత్రాలు ఆండ్రాయిడ్, యాపిల్ ఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో "యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్"లో అందుబాటులో ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24) వార్షిక బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి అధికారిక కసరత్తు అక్టోబర్ 10న ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications