Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Union Budget 2024: ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్.. చరిత్ర చూద్దామా..!

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశ పెడతారు. నిర్మలమ్మ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది వరుసగా 6వ సారి కావడం విశేషం.అయితే లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది ఉండటంతో దీన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ లేదా మధ్యంతర బడ్జెట్‌గా పిలుస్తారు. నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్‌ను 2019లో ప్రవేశపెట్టారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో వరుసగా ఐదు సార్లు బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆరవ ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. అంతకుముందు అరుణ్ జైట్లీ, పి.చిదంబరం,యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్‌లు ఆర్థికశాఖ మంత్రులుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక, అప్పటి ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న దివంగత నేత అరుణ్ జైట్లీ వరుసగా ఐదు సార్లు (2014-15 నుంచి 2018-19) బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు.అయితే అప్పటివరకు ఫిబ్రవరి నెల చివరి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయానికి చెక్ పెట్టారు అప్పటి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ. 2017 నుంచి ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే పద్ధతిని అరుణ్ జైట్లీ తీసుకొచ్చారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. ఇక అరుణ్ జైట్లీ అనారోగ్య కారణంగా ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టిన పీయూష్ గోయల్ 2019-20 మధ్యంతర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు.

Union Budget 2024: Key Highlights and Expectations as Sitharaman Prepares for Sixth Consecutive Presentation

బడ్జెట్ ప్రవేశ పెట్టిన రెండవ మహిళగా : 2019లో మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి రావడంతో నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.1970-71వ ఆర్థిక సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఇక ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండవ మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. ఇక అప్పటి వరకు బడ్జెట్‌ ప్రతులను ఒక సూట్‌కేసులో అప్పటి ఆర్థికశాఖ మంత్రులు సూట్‌కేసులో తీసుకొచ్చేవారు. కానీ రెండవసారి బీజేపీ అధఇకారంలోకి వచ్చాక నిర్మలమ్మ ఈ సాంప్రదాయానికి బ్రేక్ వేస్తూ బాహీ ఖాటా రూపంలో తీసుకొచ్చారు. దీనిపై నాలుగు సింహాల జాతీయ గుర్తు ఉంటుంది. బడ్జెట్ ప్రతులను సూట్‌కేసులో తీసుకురావడమనే సంప్రదాయం బ్రిటీషర్ల కాలం నుంచి వస్తోంది. ఇది బ్రిటీషు వారు తమ బడ్జెట్ ప్రతులను గ్లాడ్‌స్టోన్ బాక్స్‌లో తీసుకొచ్చేవారు. అక్కడి నుంచి భారత్ ఈ పద్ధతిని పాటిస్తోంది.

Union Budget 2024: Key Highlights and Expectations as Sitharaman Prepares for Sixth Consecutive Presentation

నిర్మలమ్మ ఎదుర్కొన్న సవాళ్లు : ఇక నిర్మలమ్మ ఆర్థికశాఖ మంత్రిగా పలు సవాళ్లను ఎదుర్కొంది. ఇందులో ప్రధానంగా కరోనా అతిపెద్ద సమస్యగా ఉండటంతో పాటు పెనుసవాలుగా మారింది.ఆ సమయంలో పేదలకు కావాల్సిన నిత్యావసరాలు, ఇతరత్రా అవసరాలను సమకూర్చడంలో నిర్మలమ్మ సక్సెస్ అయ్యారు. అంతేకాదు ఇవన్నీ అమలు చేస్తూనే దేశ ఆర్థిక ప్రగతికి ఎక్కడా నష్టం వాటిల్లకుండా నిర్మలమ్మ తీసుకున్న జాగ్రత్తలు, నిర్ణయాలపై పలువురు ఆర్థిక నిపుణులు ప్రశంసించారు కూడా.

ఇక 2019లో తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో భారత్ లక్ష్యం 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అని నిర్మలమ్మ సభలో ప్రకటించారు. డిజిటల్ ఇండియా క్యాంపెయిన్‌ను ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలకు విస్తరిస్తామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్‌ పథకంతో దేశంలోని ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెడతామని కూడా ప్రకటించారు. అంతేకాదు మధ్య చిన్న సూక్ష్మ పరిశ్రమలపై కూడా నిర్మలమ్మ ఫోకస్ పెట్టారు. అదేసమయంలో స్టార్టప్‌లకు ఉతమిస్తూ ప్రకటన చేశారు. డిఫెన్స్, తయారీ సంస్థ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, మెడికల్ పరికరాలను మేకిన్ ఇండియా క్యాంపెయిన్‌లో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తామనే కీలక ప్రకటన చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా లోక్‌సభలో చేసిన తన తొలి బడ్జెట్ ప్రసంగం 2 గంటల 15 నిమిషాలు సాగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+