ఏకంగా రూ. 54.1 లక్షల కోట్ల బడ్జెట్: ఆర్థిక తలరాత మార్చేలా

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉదయం సరిగ్గా 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమౌతుంది. దాదాపుగా మూడు గంటల పాటు ఏకధాటిగా కొనసాగే అవకాశం ఉంది. ఇది- ఆమె వరుసగా సమర్పించనున్న తొమ్మిదో బడ్జెట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంటరీ చరిత్రలో ఓ అరుదైన మైలురాయిగా నిలువనుంది.

నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సుమారు 54.1 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. వార్షిక వృద్ధి రేటు 7.9 శాతంగా అంచనా వేసి, బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినట్లు సమాచారం. 2023-24 ఆర్థిక సంవత్సరాల సగటు జీడీపీలో 14.8 శాతంగా ఉన్న మొత్తం వ్యయం ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో జీడీపీలో 14.2 శాతం అంటే రూ. 50.65 లక్షల కోట్లుగా నమోదైంది.

Union Budget 2026-27 Rs 54 1 Lakh Crore Spending Fueled by 7 9 Percent Growth Target by the Centre

నామమాత్రపు జీడీపీ రేటు, ఆదాయ వృద్ధి మందగించడం వల్ల సవరించిన అంచనాల్లో ఈ టోటల్ ఎక్స్ పెండిచర్ 14.0 శాతం అంటే రూ. 50.15 లక్షల కోట్లకు తగ్గవచ్చని తాజా నివేదిక అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యయం రూ. 54.1 లక్షల కోట్లుగా అంచనా వేస్తోన్నామని, ఇది 7.9 శాతం వార్షిక వృద్ధిని సూచిస్తుందని పేర్కొంది. ఇది- ద్రవ్య స్థిరీకరణతో కూడుకుని ఉంటుందని స్పష్టం చేసింది. దీనివల్ల జీడీపీలో టోటల్ ఎక్స్ పెండిచర్ సుమారు 13.8 శాతానికి తగ్గే అవకాశం ఉంది.

2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు లక్ష్యం జీడీపీలో 4.16 శాతంతో 16.37 లక్షల కోట్లు ఉంటుంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో ఇది జీడీపీలో 4.4 శాతంతో రూ. 15.69 లక్షల కోట్లు. సంఖ్యా పరంగా లోటు పెరిగినప్పటికీ- జీడీపీలో దాని వాటా తగ్గడం ద్రవ్య సుస్థిరీకరణ దిశగా కొనసాగుతున్న పురోగతిని సూచిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

సెంట్రల్ స్టాటిస్టికల్ అధికార వర్గాలు అందించిన వివరాల ప్రకారం- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి 7.4 శాతంగా అంచనా వేశారు. వాస్తవ ఆర్థిక కార్యకలాపాల్లో దాదాపు ఆరేళ్ల కాలంలో అత్యంత తక్కువ నామమాత్రపు జీడీపీ వృద్ధి (సుమారు 8 శాతం)కి విరుద్ధంగా ఉంటోంది. నామమాత్రపు పన్నుల వృద్ధి, మొత్తం రాబడి వసూళ్లను ఇది ప్రభావితం చేసిందని, ఫలితంగా రాష్ట్రాలకు కేంద్ర పన్నులు, ఇతర సుంకాలను పంపిణీ చేయడం తగ్గించిందని నివేదిక పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+