ఉద్యోగులకు గుడ్ న్యూస్, పీఆర్సీ అమలు ముహూర్తం ఫిక్స్- తాజా నిర్ణయంతో..!!
ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పంది. ఉద్యోగులు..పెన్షనర్లు వేచి చూస్తున్న 8వ పీఆర్సీ అమలు పైన నిర్ణయం తీసుకుంది. 8వ వేతన సంఘం విధి విధానాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వేతన సంఘం 18 నెలల్లో సిఫారసులను అందించేలా కాల పరిమితి నిర్దేశించింది. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని జనవరిలో నిమించగా.. ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఖరారు చేసారు. ఇక.. పీఆర్సీ అమలు ముహూర్తం దాదాపు ఖరారైంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. 8వ పే కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ 8వ పే కమిషన్‌కు ఆమోదం తెలిపింది. 8వ పే కమిషన్‌కు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనప్రకాశ్ దేశాయ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత 2026, జనవరి 1వ తేదీ నుంచి ఈ నూతన పీఆర్సీ సిఫార్సులు అమల్లోకి వచ్చేలా ఉద్యోగుల జీతాల్లో పెంపుదల ఉండ నుంది. కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు.. పెన్షనర్లు కలిపి దాదాపుగా 1.15 లక్షల మందికి నూతన పీఆర్సీ ద్వారా ఆర్దికంగా ప్రయోజనం కలగనుంది. 8వ పే కమిషన్ అమలులోకి వస్తే ఉద్యోగుల కనీస వేతనం రూ.34 వేలకు పెరిగే అవకాశం ఉంది.

ఈ సారి ఉద్యోగ సంఘాలు కొత్త పీఆర్సీ ద్వారా కనీస పెన్షన్ ను రూ 17వేలకు పైగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. గత జనవరిలోనే పీఆర్సీ ఏర్పాటు పై ప్రకటన చేసినా.. అనేక రకాల సంప్రదింపులు.. కసరత్తు తరువాత ఈ రోజు భేటీలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్.. కాలపరిమితిని ఖరారు చేసారు. 7వ వేతన సంఘం 2016లో అమలులోకి వచ్చింది. పే బ్యాండ్స్, గ్రేడ్ పే వంటి వాటి స్థానంలో సింప్లిఫైడ్ పే మ్యాట్రిక్ అమలులోకి తీసుకొచ్చారు. గత పీఆర్సీలో కేబినెట్ సెక్రటరీ స్థాయికి గరిష్ఠంగా నెలకు రూ. 2.50 లక్షల వేతనం నిర్ణయించారు. గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు ఇటీవలే పెంచారు. ఇప్పుడు తాజాగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఖరారు కావటంతో.. పీఆర్సీ కమీషన్ తమ పని ప్రారంభించనుంది. ఉద్యోగులు, వివిధ వర్గాలతో చర్చల తరువాత కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. బీహార్ ఎన్నికల వేళ ఈ నిర్ణయం గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications